Sanju Samson: టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత ఓపెనర్‌గా రాణించిన సంజూ శాంసన్‌కు ఆసియా టీ20 కప్‌లో కష్టాలు మొదలయ్యాయి. శుభ్‌మన్ గిల్ రాకతో సంజూ స్థానం కోల్పోయాడు. ఇప్పుడు అతడిని ఐదవ నుంచి ఎనిమిదవ స్థానం వరకు బ్యాటింగ్‌కు పంపుతున్నారు.
టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం టీమిండియా ఓపెనర్‌గా సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 13 ఇన్నింగ్స్‌లలో 183కు పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించి, మూడు శతకాలు నమోదు చేశాడు. అయితే, ఆసియా టీ20 కప్ 2025లో శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా రీఎంట్రీ ఇవ్వడంతో సంజూకు పరిస్థితులు మారిపోయాయి.
25
సంజూ బ్యాటింగ్ ఆర్డర్ మార్పు..
భవిష్యత్తు కెప్టెన్‌గా భావిస్తున్న గిల్ ఓపెనర్‌గా వచ్చేందుకు యాజమాన్యం సంజూపై వేటు వేసింది. ఆ టోర్నీలో సంజూకు బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రత్యేక స్థానం లేకుండా పోయింది. ఆసియా కప్‌లో మూడుసార్లు ఐదవ స్థానంలో, ఒకసారి ఆరవ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.
35
మాజీ కెప్టెన్ స్పందించారు
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదవ స్థానం వరకు అతడికి పిలుపు రాలేదు. వికెట్ కీపర్‌గా మాత్రమే అతడి సేవలను ఉపయోగించుకున్నారు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలోనూ తొలి టీ20లో శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించారు.
భారత జట్టులో ప్రస్తుతం సంజూ శాంసన్ అత్యంత దురదృష్టవంతుడైన ఆటగాడని శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. ఓపెనర్‌గా సెంచరీ చేసిన అతడిని ఇప్పుడు మూడు నుండి ఎనిమిదవ స్థానం వరకు ఎక్కడైనా బ్యాటింగ్‌కు పంపడానికి మేనేజ్‌మెంట్ వెనుకాడటం లేదని, అవసరమైతే 11వ స్థానంలో కూడా బ్యాటింగ్ చేయమంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
55
డిమోట్ చేయడం సరికాదు
టాప్ ఆర్డర్‌లో రాణించిన ఆటగాడిని డిమోట్ చేయడం సరికాదని, ఇది ఆటగాడి మనసును గాయపరుస్తుందని ఆయన అన్నారు. సంజూకు ప్రస్తుతం దీనికంటే గొప్ప ఆప్షన్ లేదని పేర్కొన్నారు. ఇక ఆస్ట్రేలియాతో జరుగుతోన్న టీ20 సిరీస్ మొదటి మ్యాచ్ జరగకపోగా.. రెండో మ్యాచ్ లో మూడో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చాడు సంజూ. చూడాలి మరి వచ్చే సిరీస్ లోనైనా సంజూ బ్యాటింగ్ పై క్లారిటీ వస్తుందో.. లేక జట్టులో చోటు కోల్పోతాడో..