అందంతో పాటు ఆట‌లోనూ అద‌ర‌గొట్టారు.. టెన్నిస్ ప్రపంచంలోని టాప్-5 అంద‌మైన‌ ప్లేయ‌ర్లు

First Published | Aug 16, 2024, 5:41 PM IST

Beautiful Tennis Players: అందంతో పాటు త‌మ అద్భుత‌మైన ఆట‌తో టెన్నిస్ ప్రపంచాన్ని ఏలిన ప్లేయ‌ర్లు చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ టెన్నిస్ స్టార్లకు అభిమానుల కొరత లేదు. టెన్నిస్ ప్రపంచంలో అత్యంత అందమైన 5 మహిళా క్రీడాకారిణులను గ‌మ‌నిస్తే అందులో భార‌త స్టార్ సానియా మీర్జా కూడా క‌నిపిస్తారు. టాప్-5 అంద‌మైన మ‌హిళా టెన్నిస్ ప్లేయ‌ర్లను గ‌మ‌నిస్తే..
 

Beautiful Tennis Players: యూజీనీ బౌచర్డ్.. టెన్నిస్ సర్కిల్‌లలో బాగా ప్రాచుర్యం పొందిన పేరు. కెనడా స్టార్ టెన్నిస్ ప్లేయర్ యూజీనీ బౌచర్డ్ ఐదు సంవత్సరాల వయస్సులో టెన్నిస్ ఆడటం ప్రారంభించాడు. ఆమె అందానికి అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. యూజీనీ బౌచర్డ్ అందంలో సినీ నటుల కంటే త‌క్కువ‌కాదు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

సానియా మీర్జా

భారత మహిళా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా త‌న‌ అందంతో పాటు ఆట‌తో అద‌ర‌గొట్టి స్టార్ ప్లేయ‌ర్ గా ఎదిగారు. సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికీ ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సానియా మీర్జాకు 13.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 


మరియా షరపోవా

రష్యా మహిళా టెన్నిస్ క్రీడాకారిణి మరియా షరపోవా అందానికి అంద‌రూ ఫిదా అవుతారు. ఆమె 2020 సంవత్సరంలో టెన్నిస్ కోర్టు నుండి రిటైర్మెంట్ ప్రకటించింది. షరపోవా ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకుంది. అందంతో పాటు అద్భుత‌మైన ఆట‌తో ఆమె భారీ ఫాలోయింగ్ ను సంపాదించింది. 

అన ఇవానోవిచ్ 

ప్రపంచ మాజీ నంబర్ వన్ అన ఇవానోవిచ్ 29వ ఏట రిటైరైంది. ఈ సెర్బియా స్టార్ అనా ఇవానోవిచ్ అందంలో హాలీవుడ్ స్టార్లకు త‌క్కువ కాదు. అన ఇవానోవిచ్ కు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అనా ఇవానోవిచ్ ప్రపంచ నంబర్ 1 టెన్నిస్ క్రీడాకారిణి కూడా.

అన్నా కోర్నికోవా

రష్యాకు చెందిన అన్నా కోర్నికోవాకు అందంలో సాటి లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో అన్నా కోర్నికోవాకు 1.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఫోటోలు అనేక అంత‌ర్జాతీయ‌ మ్యాగజైన్‌ల కవర్ పేజీలపై వ‌చ్చాయి.

Latest Videos

click me!