నీర‌జ్ చోప్రాతో పెళ్లి.. సిగ్గుప‌డుతూ.. మ‌ను భాక‌ర్ ఏమ‌న్నారంటే..?

First Published | Aug 15, 2024, 2:19 PM IST

Manu Bhaker Neeraj Chopra : పారిస్ ఒలింపిక్స్ 2024 మెడ‌ల్ విజేత‌లు నీరజ్ చోప్రా, మను భాకర్ పెళ్లి చేసుకోబోతున్నార‌నే వార్త‌లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఓ కార్య‌క్ర‌మంలో వీరిద్ద‌రూ సిగ్గుప‌డుతూ క‌నిపించిన దృశ్యాలు వైర‌ల్ అవుతున్నాయి. 
 

Neeraj Chopra-Manu Bhaker

Manu Bhaker Neeraj Chopra : ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్ వేదిక‌గా జ‌రిగిన ఒలింపిక్స్ 2024లో భారత్ ఆరు మెడ‌ల్స్ సాధించింది. జావెలిన్ త్రోలో అథ్లెట్ నీరజ్ చోప్రా రజత పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. అంత‌కుముందు, టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు.

Neeraj Chopra Manu Bhaker

పారిస్ ఒలింపిక్స్ 2024 లో మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ బ్రాంజ్ మెడ‌ల్ గెలుచుకుంది. అలాగే, మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో సరబ్జోత్ సింగ్‌తో కలిసి కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి భారత క్రీడా ప్రపంచంలో చరిత్ర సృష్టించాడు.


manu bhaker and neeraj chopra

తాజాగా ఈ ఇద్ద‌రు ఒలింపిక్ స్టార్లు ఒక కార్య‌క్ర‌మంలో క‌లిశారు. నీర‌జ్ చోప్రా, మ‌ను భాక‌ర్ మాట్లాడుకుంటున్న స‌మ‌యంలో సిగ్గుప‌డుతూ క‌నిపించాడు. అలాగే, మను భాకర్ తల్లి నీరజ్ చోప్రాతో ప్ర‌త్యేకంగా మాట్లాడుతూ ఒట్టేయించుకున్న దృశ్యాలు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ క్ర‌మంలోనే నీరజ్ చోప్రా-మను భాకర్ల వివాహం గురించి సోషల్ మీడియాలో చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ ఒలింపిక్స్ స్టార్లు త్వ‌ర‌లోనే వివాహం చేసుకోబోతున్నార‌ని చ‌ర్చ‌కు తెర‌లేసింది.

మను భాకర్ ఇంటర్వ్యూ క్లిప్ X ప్లాట్‌ఫారమ్‌లో వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో, నీరజ్ చోప్రాతో ఆమె వివాహం గురించి ఒక ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్న వినగానే మను సిగ్గుపడ్డారు. అనంతరం మనుభాకర్ తన భావాలను వ్యక్తం చేశారు. ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది.

ఆ రోజు నీరజ్‌తో తన తల్లి ఏం మాట్లాడిందో తనకు నిజంగా తెలియదని చెప్పారు. అందులో నిజం లేద‌న్నారు. అలాగే,  ఈ పుకార్లన్నింటికీ మను భాకర్ తండ్రి కిషన్ పూనియా ఫుల్ స్టాప్ పెట్టే ప్ర‌యత్నం చేశారు. మ‌నుది ప్ర‌స్తుతం పెళ్లి వ‌య‌స్సు కాద‌ని పేర్కొన్నారు. 

కాగా, 2018 నుంచి ఆమె మరియు నీరజ్ కొన్ని కార్యక్రమాలలో కలుసుకుంటూనే ఉన్నారు. క‌లిసిన‌ప్పుడు త‌మ బాగోగులు ఆడిగి తెలుసుకుంటామ‌న్నారు. అలాగే, వివాహం పై వ‌స్తున్న‌వి కేవ‌లం రూమ‌ర్లుగా కొట్టిపారేశారు. 

Latest Videos

click me!