Ishan Kishan : న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా సిరీస్ చివరి మ్యాచ్ లో కేవలం 43 బంతుల్లోనే 103 పరుగులు చేసి తన తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీని సాధించాడు.
ఇషాన్ కిషన్ ఈజ్ బ్యాక్.. ఇది సెంచరీ కాదు, విమర్శకులకి పగిలే ఆన్సర్!
ఎవడ్రా వాడు.. ఇషాన్ కిషన్ పని అయిపోయింది అన్నది? ఎవడ్రా వాడు.. సెంట్రల్ కాంట్రాక్ట్ పోయింది, ఇక కిషన్ పత్తా ఉండడు అన్నది? ఒక్కసారి తిరువనంతపురం గ్రౌండ్ వైపు చూడండి.. అక్కడ జరిగింది క్రికెట్ మ్యాచ్ కాదు, ఇషాన్ కిషన్ అనే సునామీ! ఏడాదిన్నర కాలం.. కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశాడు. బీసీసీఐ నుంచి వేటు పడ్డా, విమర్శలు చుట్టుముట్టినా.. మౌనంగానే ఉన్నాడు. కానీ, లోపల కసి మాత్రం అగ్నిపర్వతంలా దాచుకున్నాడు. ఇప్పుడు ఆ అగ్నిపర్వతం పేలింది.. కివీస్ బౌలర్లు బూడిదయ్యారు !
24
తిలక్ వర్మ లేకపోవడంతో ఇషాన్ కిషన్ ఎంట్రీ !
తిలక్ వర్మకు దెబ్బ తగిలితే ఇషాన్ కిషన్ కు ఛాన్స్ వచ్చింది.. కానీ ఆ ఛాన్స్ వాడుకున్న తీరు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కిషన్ బ్యాట్ ఝుళిపిస్తుంటే బంతి బౌండరీ లైన్ దగ్గర ఎక్కడా ఆగలేదు. ఫోర్లు కొట్టడం మానేసి.. సిక్సర్ల మోత మోగించాడు.. అంతా గగన విహారమే. ఆ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు.. ఏకంగా 10 సిక్సర్లు! అవును, మీరు విన్నది కరెక్టే.. 10 సార్లు బంతిని గాల్లోకి లేపి స్టాండ్స్‌లో పడేశాడు. ఒక్కొక్క సిక్సర్ విమర్శకుల నోళ్లు మూయించే బుల్లెట్‌లా దూసుకెళ్లింది. కేవలం 42 బంతుల్లోనే సెంచరీ.. ఇది కదా అసలైన కమ్‌బ్యాక్ అంటే!
ఈ దెబ్బతో మనోడు మామూలు రికార్డు కొట్టలేదు. వన్డేల్లో డబుల్ సెంచరీ, టీ20ల్లో సెంచరీ బాదిన రెండో భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పక్కన కుర్చీ వేసుకుని కూర్చున్నాడు ఇషాన్ కిషన్. ఇన్నాళ్లూ తన గురించి మాట్లాడిన నోళ్లన్నీ ఇప్పుడు సెంచరీ దెబ్బకు మూతపడ్డాయి. సంజూ శాంసన్ ఫెయిల్ అయిన చోట.. కిషన్ నిప్పులు చెరిగాడు.
34
సూపర్ సెంచరీతో దుమ్మురేపిన ఇషాన్ కిషన్
సూర్యభాయ్ కూడా 63 రన్స్‌తో ఊచకోత కోయడంతో ఇండియా స్కోర్ కొండలా పెరిగింది. కానీ హైలైట్ మాత్రం ఇషాన్ కిషనే! 2026 టీ20 వరల్డ్ కప్‌లో నా సీటు ఎవరికీ ఇచ్చేది లేదని కిషన్ ఇండైరెక్ట్‌గా చెప్పలేదు.. గట్టిగా అరిచి మరీ చెప్పాడు. కిషన్ ఈజ్ అఫీషియల్లీ బ్యాక్ ఇన్ మిషన్! ఇక ముందుంది అసలైన జాతర!
తన 103 పరుగుల సెంచరీ నాక్ లో ఇషాన్ కిషన్ 10 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. ఇషాన్ సూపర్ ఇన్నింగ్స్ తో భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది.
మొత్తంగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోయారు. ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆయన, తన పవర్‌ఫుల్ హిట్టింగ్‌తో కివీస్ బౌలర్లను వణికించారు. తొలి మ్యాచ్‌లో కేవలం 8 పరుగులకే అవుటైనప్పటికీ, రెండో టీ20లో కేవలం 32 బంతుల్లోనే 76 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చారు.
ఇక మూడో మ్యాచ్‌లో 28 పరుగులతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. అయితే, సిరీస్‌కే హైలైట్ అని చెప్పదగ్గ ఇన్నింగ్స్ తిరువనంతపురంలో జరిగిన ఐదో టీ20లో నమోదైంది. ఈ అద్భుత ప్రదర్శనతో భారత్ సిరీస్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, రాబోయే వరల్డ్ కప్ రేసులో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు.