T20 World Cup 2026 : న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ వరుస వైఫల్యాలు చెందడంతో, టీ20 ప్రపంచకప్‌లో అతని స్థానానికి ముప్పు ఏర్పడింది. ఇషాన్ కిషన్ అదరగొట్టడంతో ఈ రేసులో ముందున్నాడు. అతని సూపర్ నాక్ లతో ప్లేస్ ఖాయం చేసుకున్నాడు.
భారత క్రికెట్ జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ల మధ్య పోటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో, సంజూ శాంసన్ తన ఫామ్‌ను కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ప్రదర్శనతో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ అతనికి మంచి అవకాశాన్ని కల్పించింది.
26
సొంత గడ్డపై నిరాశపరిచిన సంజూ శాంసన్
న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో, చివరి టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ భారీ అంచనాల మధ్య బరిలోకి దిగాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఇది సంజూ శాంసన్‌కు తన సొంత రాష్ట్రంలో ఆడుతున్న మొదటి అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో కేరళ అభిమానులు భారీగా తరలివచ్చారు. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఓపెనర్‌గా వచ్చిన సంజూ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ వైఫల్యం స్టేడియంలోని అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
36
సంజూ శాంసన్ : సిరీస్ అంతటా వైఫల్యాల పరంపర
కేవలం చివరి మ్యాచ్ మాత్రమే కాదు, న్యూజిలాండ్‌తో జరిగిన మొత్తం టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా ఆయన 25 పరుగుల మార్కును దాటలేకపోయాడు. బ్యాటింగ్‌లోనే కాకుండా వికెట్ కీపింగ్‌లో కూడా సంజూ తడబడటం చర్చనీయాంశమైంది. క్యాచ్‌లు వదిలేయడం, బంతిని సరిగ్గా అడ్డుకోలేకపోవడం వంటి తప్పిదాలు అతనిపై విమర్శలు వచ్చేలా చేశాయి. పవర్‌ప్లే ముగియకముందే సంజూ వికెట్ పారేసుకోవడం జట్టు మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.
సంజూ శాంసన్ మైదానంలో ఆత్మవిశ్వాసం లేకుండా కనిపిస్తున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యర్థి బౌలర్లకు తన వికెట్‌ను సులువుగా సమర్పించుకుంటున్నాడు. మరోవైపు, తిలక్ వర్మ గాయంతో దూరం కావడంతో వచ్చిన అవకాశాన్ని ఇషాన్ కిషన్ రెండు చేతులా అవకాశాన్ని ఒడిసి పట్టుకున్నాడు. ఇషాన్ కిషన్ ఈ సిరీస్‌లో ఇప్పటికే ఒక మెరుపు హాఫ్ సెంచరీ బాదగా, ఐదో టీ20లో సూపర్ సెంచరీతో దుమ్మురేపాడు. ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడుతూ జట్టు స్కోరును పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
56
టీ20 ప్రపంచకప్ జట్టులో మార్పు తప్పదా?
టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ప్రస్తుత భారత జట్టులో ఇద్దరు వికెట్ కీపర్ల స్థానాల కోసం సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సంజూ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని జారవిడుచుకుంటుంటే, ఇషాన్ కిషన్ మాత్రం స్థిరమైన ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. వరుసగా హాఫ్ సెంచరీలు బాదుతున్న ఇషాన్‌ను పక్కన పెట్టడం ఇప్పుడు దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. దీంతో ప్రపంచకప్ తుది జట్టు నుంచి సంజూను తొలగించి, ఇషాన్‌ను ప్రధాన కీపర్‌గా కొనసాగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
66
ఇషాన్ కిషన్ జెండా పాతేశాడు !
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, టీ20 ప్రపంచకప్‌లో ఇషాన్ కిషన్ ఆడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. తిలక్ వర్మ స్థానంలో వచ్చినప్పటికీ, ఇషాన్ తన బ్యాటింగ్ శైలితో ఆ స్థానానికి పూర్తి న్యాయం చేస్తున్నాడు. ఒకవేళ సంజూ శాంసన్ తన ప్రదర్శనను మెరుగుపరుచుకోకపోతే, ప్రపంచకప్ బెర్త్ కోల్పోవడమే కాకుండా కెరీర్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకే ప్రాధాన్యం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు, నెటిజన్లు సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.