T20 World Cup : జింబాబ్వేపై విండీస్ విజయం.. ఇక టీమిండియా సెమీస్ కు చేరే మార్గాలివే..?

Published : Feb 24, 2026, 02:24 PM IST

ICC Men's T20 World Cup 2026 : సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి… వెస్టిండిస్ చేతిలో జింబాబ్వే ఓటమి తర్వాత సూపర్-8 గ్రూప్ 1 లో ఏ టీం సెమీస్ అవకాశాలు ఎలా ఉన్నాయి..? 

PREV
18
భారత్ వరల్డ్ కప్ ఆశలు సజీవంగా ఉండాలంటే..

ICC Men's T20 World Cup 2026 : జింబాబ్వేపై వెస్టిండిస్ భారీ విజయం టీమిండియాకు పుండుమీద కారం చల్లినట్లుగా ఉంది. ఇప్పటికే కీలకమైన సూపర్-8 లొ సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి... ఈ క్రమంలో వెస్టిండిస్ ఏకంగా 107 పరుగుల భారీ తేడాతో జింబాబ్వేను ఓడించడంతో టీమిండియా అవకాశాలు మరింత సన్నగిల్లాయి.

టీ20 వరల్డ్ కప్ సెమీస్ రేసులో నెట్ రన్ రేట్ కీలకం కానుంది.. ఇప్పటికే వెస్టిండిస్, సౌతాఫ్రికా జట్లు భారీ విజయాలతో మంచి రన్ రేట్ సాధించాయి. భారత్, జింబాబ్వేలు ఘోర ఓటమితో మైనస్ రన్ రేట్ కలిగివున్నాయి. ఈ క్రమంలో భారత్ మిగతా రెండు మ్యాచులు గెలిచినా సెమీస్ కు చేరాలంటే మెరుగైన రన్ రేట్ అవసరం కావచ్చు. అంటే సౌతాఫ్రికా, వెస్టిండిస్ తరహాలో భారీ విజయాలు నమోదుచేసుకోవాలి.

28
టీమిండియా సెమీస్ అవకాశాలు ఎలా ఉన్నాయి..?

సూపర్-8 లో కీలకమైన మొదటి మ్యాచ్ లోనే టీమిండియా భారీ పరుగుల తేడాతో ఓడిపోయింది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడటం టీమిండియాను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. ఇప్పుడు వెస్టిండీస్ భారీ విజయంతో రెండు పాయింట్లు సాధించడమే కాదు మంచి నెట్ రన్ రేట్ (NRR)తో పాయింట్స్ టేబుల్ లో టాప్ లో నిలిచింది. విండీస్ మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒక్కటి గెలిచినా భారత్ సెమీస్ ఆశలు దాదాపు గల్లంతయినట్లే.

38
టీమిండియా తర్వాతి రెండు మ్యాచులు గెలవాల్సిందే..

1. సూపర్-8 లో టీమిండియా తర్వాత మ్యాచ్‌ జింబాబ్వేతో తలపడనుంది. ఫిబ్రవరి 26న చెన్నై చెపాక్ స్టేడియంలో ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి... ఒకవేళ ఓడితే ఆశలు వదులుకోవాల్సిందే. జింబాబ్వేతో పాటు వెస్టిండిస్ పై గెలిస్తే టీమిండియా సెమీస్ కు చేరుకొవచ్చు.

48
జింబాబ్వేతో అంత ఈజీ కాదు...

2. ఇప్పటికే వెస్టిండిస్ చేతిలో జింబాబ్వే ఓడిపోయింది... భారత్ చేతిలోనూ ఓటమిపాలైతే ఆ టీం వరల్డ్ కప్ నుండి ఎలిమినేట్ అయినట్లే. దీంతో సెమీస్ బెర్తు కోసం మూడు జట్లు రేసులో ఉంటాయి. అంటే సూపర్ 8 పోరు మరింత రసవత్తరంగా మారుతుంది.

58
టీమిండియా ఈజీగా సెమీస్ కు చేరే మార్గం

3. సౌతాఫ్రికా సూపర్-8 లో మూడు మ్యాచ్‌లలో గెలిస్తే ఆరు పాయింట్లతో గ్రూప్ 1 టాపర్ గా నిలుస్తుంది... అంటే వెస్టిండిస్, జింబాబ్వేను ఓడించాలన్నమాట. అప్పుడు భారత్ తన తర్వాతి రెండు మ్యాచ్‌లలో జింబాబ్వే, వెస్టిండీస్‌లపై గెలిస్తే 4 పాయింట్లు సాధిస్తుంది. వెస్టిండిస్ రెండు ఓటములతో తర్వాతి స్థానానికి పరిమితం అవుతుంది... కాబట్టి రన్ రేట్ తో పనిలేకుండా భారత్ నేరుగా సెమీస్ కు చేరుకుంటుంది. ఇది భారత్ సెమీస్ కు చాలా ఈజీగా చేరే అవకాశాలున్న మార్గం.

68
నెట్ రన్ రేట్ సెమీస్ బెర్తును ఎప్పుడు నిర్ణయిస్తుంది..?

4. ఒకవేళ సౌతాఫ్రికా ఒక మ్యాచ్ ఓడిపోయి... వెస్టిండిస్ ని మనం ఓడించి, జింబాబ్వే అన్ని మ్యాచులు ఓడిపోతే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుంది. భారత్ తో పాటు విండిస్, సౌతాఫ్రికా రెండేసి విజయాలతో 4 పాయింట్లు సాధించి సమంగా ఉంటాయి. అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా సెమీస్ బెర్తులు ఖరారవుతాయి.

78
ఒక్క మ్యాచ్ ఓడినా టీమిండియా ఇంటికే

5. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే భారత్ జింబాబ్వేపై లేదంటే వెస్టిండీస్‌పై భారీ విజయం సాధించాలి. ఇంకా ఒక్కమ్యాచ్ లో ఓడినా టీమిండియా సెమీస్ కు చేరుకోవడం కష్టం కాదు దాదాపు అసాధ్యం అని చెప్పాలి.

88
గ్రూప్ 1 సూపర్ 8 మ్యాచ్‌ల షెడ్యూల్

ఫిబ్రవరి 26 - సౌతాఫ్రికా vs వెస్టిండీస్ (అహ్మదాబాద్)

ఫిబ్రవరి 26 - ఇండియా vs జింబాబ్వే (చెన్నై)

మార్చి 1 - సౌతాఫ్రికా vs జింబాబ్వే (ఢిల్లీ)

మార్చి 1 - ఇండియా vs వెస్టిండీస్ (కోల్‌కతా)

Read more Photos on
click me!

Recommended Stories