ICC Men's T20 World Cup 2026 : టీమిండియా ఓపెపర్ అభిషేక్ శర్మ ఈ టీ20 వరల్డ్ కప్ లో మొదటి మూడు మ్యాచుల్లో సాధించింది 0,0,0 పరుగులే. అయినా అతడిని సూపర్-8 లో అవకాశం ఇచ్చారు… ఎందుకో తెలుసా?
Abhishek Sharma : ఇదేమీ సాధాసీధా ద్వైపాక్షిక సీరీస్ కాదు... ఐసిసి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీ20 వరల్డ్ కప్. అదీ స్వదేశంలో జరుగుతుండటంతో గెలుపోటములు టీమిండియాపై తీవ్ర ప్రభావం చూపుతాయి... సౌతాఫ్రికాతో ఒక్క ఓటమి ఎంతటి చర్చకు దారితీసిందో చూస్తున్నాం. ఇలాంటి కీలక టోర్నీలో ఓ బ్యాటర్ వరుసగా 0,0,0 పరుగులతో హ్యాట్రిక్ డకౌట్ అయితే... వెంటనే పక్కన కూర్చోబెట్టాల్సింది. కానీ అభిషేక్ శర్మ విషయంలో అలా జరగలేదు... అతడికి కీలకమైన సూపర్-8 లోనూ అవకాశం ఇచ్చారు.
అయితే సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఘోర పరాజయం తర్వాత అభిషేక్ ఆటతీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత ఘోరంగా ఆడుతున్న అతడిని ఎందుకు కొనసాగిస్తున్నారు..? సంజూ శాంసన్ లేదంటే ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ను ఆడించి ఉండాల్సిందిగా..? అనే ప్రశ్నలు టీమిండియా మేనేజ్మెంట్ కు ఎదురవుతున్నాయి. మరి అభిషేక్ నే కొనసాగించడానికి టీమిండియా చెబుతున్న కారణాలేంటో ఇక్కడ చూద్దాం.
26
2025 లో అభిషేక్ ఫామ్...
ఐసిసి టీ20 వరల్డ్ కప్ కు ముందు అభిషేక్ శర్మ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. 2025లో 21 మ్యాచుల్లో ఏకంగా 193.46 స్ట్రైక్ రేట్‌తో 859 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనను దృష్టిలో ఉంచుకునే అతడికి మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తున్నారు. ఫామ్ ను అందిపుచ్చుకుంటే మిరాకిల్స్ చేయగల సామర్థ్యం అతడిది... ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించగలడు. అందుకే ఈ యంగ్ ఓపెనర్ పదేపదే విఫలమవుతున్నా ఆడిస్తున్నారు.
36
టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ గా గుర్తింపు..
అభిషేక్ శర్మ బ్యాటింగ్ సరిగ్గా టీ20 లకు సరిపోతుంది. ధనాధన్ ఆటతో జట్టుకు మంచి ఆరంభాన్ని అందిస్తాడు... అదే తర్వాత వచ్చే బ్యాటర్లు కూడా కొనసాగిస్తారు. ఓపెనర్ గా అతడికి మంచి రికార్డే ఉంది... అందుకే అతడిని కొనసాగిస్తున్నారు.
ఇప్పటివరకు 42 ఇంటర్నేషనల్ టీ20 మ్యాచులు ఆడిన అభిషేక్ 1312 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 లో అతడి హయ్యెస్ట్ స్కోర్ 135 పరుగులు. అతడి ఖాతాలో 89 సిక్సర్లు, 125 ఫోర్లు ఉన్నాయి. ఈ గణాంకాలు కూడా అభిషేక్ ను కొనసాగించడానికి కారణం.
అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతుండటంతో ఎందుకు అతడిని ఇంకా కొనసాగిస్తున్నారు..? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సమాధానమిదే. 'అభిషేక్ స్థానంలో సంజూను ఆడించమంటారా? లేక మూడో నంబర్‌లో తిలక్ వర్మ బదులు సంజూ రావాలంటారా? మేము ఫామ్‌లో లేనప్పుడు గత ఏడాదిగా మమ్మల్ని కాపాడింది అభిషేకే. ఇప్పుడు అతను ఫామ్‌లో లేనప్పుడు సపోర్ట్ గా నిలవడం మా బాధ్యత' అని అన్నాడు.
''మాకు అభిషేక్ గురించి ఎలాంటి ఆందోళన లేదు. అతడి ఫామ్ గురించి ఆలోచిస్తూ బాధపడే వాళ్లను చూస్తేనే నాకు బాధగా ఉంది. అభిషేక్ పరుగులు చేయలేదన్నది నిజమే. కానీ ఒక్కసారి అతను పరుగులు చేయడం మొదలుపెడితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు' అంటూ అభిషేక్ పై తనకు ఎంత నమ్మకం ఉందో బైటపెట్టాడు సూర్యకుమార్. దీన్నిబట్టి అభిషేక్ కు కెప్టెన్ గట్టిగా మద్దతివ్వడంతోనే వరల్డ్ కప్ లో విఫలం అవుతున్నా జట్టులో కొనసాగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
56
గంభీర్, మోర్కెల్ సపోర్ట్...
టీమిండియా హెడ్ కోచ్ తో గౌతమ్ గంభీర్ తో పాటు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా అభిషేక్‌కు సపోర్ట్ గా నిలిచారు. మోర్కెల్ అయితే బహిరంగంగానే అండగా మాట్లాడాడు... ''అభిషేక్ ప్రపంచ స్థాయి ఆటగాడు, జట్టులో అతని ఫామ్ గురించి ఎలాంటి చర్చలు జరగడం లేదు'' అని స్పష్టం చేశాడు. దీన్ని బట్టి కెప్టెన్, కోచ్ లు అభిషేక్ వెనక ఉన్నట్లు అర్థమవుతోంది.
66
అభిషేక్ చెత్త రికార్డు...
ఇదిలావుంటే టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 వరల్డ్ కప్ కు ముందునుండి తడబడుతున్నాయి. వరల్డ్ కప్ లో 3, అంతకు ముందు 2 డకౌట్లు... మొత్తంగా ఒకే క్యాలెండర్ ఇయర్‌లో (అదీ ఫిబ్రవరి నెలలోనే) అత్యధికసార్లు డకౌట్ అయిన చెత్త రికార్డును కూడా అభిషేక్ నమోదుచేశాడు.
వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో మూడు మ్యాచులాడిన అభిషేక్ అసలు పరుగుల ఖాతా తెరవలేదు.. యూఎస్ఏ పై 1 బంతిని ఎదుర్కొని 0, పాకిస్థాన్ పై 4 బంతుల్లో 0, నెదర్లాండ్ పై 3 బంతులు ఎదుర్కొని 0 రన్స్ సాధించాడు. సూపర్-8 లో సౌతాఫ్రికాపై 12 బంతుల్లో 15 పరుగులు చేశాడు... ఈ వరల్డ్ కప్ లో ఇవే అతడి టోటల్ స్కోరు.