Suryakumar Yadav : టీ20 క్రికెట్‌లో సూర్యకుమార్ యాదవ్ సృష్టించిన అద్భుత ప్రపంచ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. కేవలం 63 నిమిషాల్లో సెంచరీ బాది హిస్టరీ క్రియేట్ చేసిన స్కై రికార్డు వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
టీ20 క్రికెట్ అంటేనే బ్యాటంగ్ సునామీ.. మెరుపు దాడి. మైదానంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచే బౌలర్లపై విరుచుకుపడే బ్యాటర్లు చాలామంది ఉంటారు. కానీ, నిమిషాల లెక్కన చూస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన రికార్డు ఒక భారత బ్యాటర్ సొంతం. ఆ బ్యాటర్ మరెవరో కాదు, ప్రస్తుత టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఒకానొక మ్యాచ్‌లో అతను సృష్టించిన విధ్వంసానికి ప్రత్యర్థి జట్టు బౌలర్లు బెంబేలెత్తిపోయారు.
25
63 నిమిషాల్లోనే సెంచరీ.. సూర్య సంచలనం
క్రికెట్ చరిత్రలో బంతుల లెక్కన సెంచరీల గురించి మనం వినే ఉంటాం. కానీ, నిమిషాల లెక్కన చూస్తే సూర్యకుమార్ యాదవ్ (SKY) పేరు ప్రపంచ రికార్డుల్లో నిలిచిపోయింది. 20 నవంబర్ 2022న న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో సూర్య కేవలం 63 నిమిషాల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇది టీ20 క్రికెట్ చరిత్రలోనే నిమిషాల పరంగా అత్యంత వేగవంతమైన సెంచరీ. ఆ రోజు సూర్య బ్యాటింగ్ చూస్తుంటే బౌలర్లు కనీసం కరుణించమని వేడుకుంటున్నారా అన్నట్లుగా సాగింది అతని జోరు.
35
11 ఫోర్లు.. 7 సిక్సర్లు.. కివీస్ గడ్డపై విధ్వంసం
న్యూజిలాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 51 బంతుల్లోనే 111 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఆ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 217.65గా నమోదైంది. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో సూర్య అంతకుముందు కెన్యా బ్యాటర్ అలెక్స్ ఒబాండా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అలెక్స్ 2021లో నైజీరియాపై 68 నిమిషాల్లో సెంచరీ చేయగా, సూర్య దానిని 5 నిమిషాల ముందే పూర్తి చేసి రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
సూర్య విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. కివీస్ జట్టు 18.5 ఓవర్లలో కేవలం 126 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 65 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సూర్య ఆడిన ఆ ఇన్నింగ్స్ ఇప్పటికీ టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోతుంది.
55
కెప్టెన్సీపై భిన్నాభిప్రాయాలు.. భవిష్యత్తు సవాలే
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ 2026 టీ20 ప్రపంచకప్ గెలిచినప్పటికీ, అతని భవిష్యత్తుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా 2028లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో జరిగే టీ20 వరల్డ్ కప్ నాటికి సూర్య వయసు 37 ఏళ్లకు చేరుకుంటుంది. అదే ఏడాది లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో కూడా భారత్ పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, ఒక వృద్ధుడైన నాయకుడి కంటే, జట్టును ముందుండి నడిపించే ఒక యువ కెప్టెన్ భారత్‌కు అవసరమనే చర్చ మొదలైంది. గత రికార్డులు ఎంత గొప్పగా ఉన్నా, ప్రస్తుత ఫామ్, వయసు దృష్ట్యా కెప్టెన్సీ మార్పు అనివార్యమని కొందరు విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.