సన్‌రైజర్స్ ప్లానింగ్ అదిరిందిగా.. ఈ ఆటగాళ్లను అస్సలు ఊహించలేరు.!

Published : Dec 14, 2025, 05:14 PM IST

SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ రాబోయే ఐపీఎల్ వేలానికి రూ. 25.5 కోట్ల పర్స్‌తో ఉంది. 10 స్లాట్లు(రెండు విదేశీ) అందుబాటులో ఉండగా.. ఇండియన్ స్పిన్నర్, బ్యాకప్ ఓపెనర్, ఫినిషర్లు, పేసర్‌లు, బ్యాకప్ బ్యాటర్‌ల కోసం SRH లక్ష్యాలను సిద్దం చేసింది. 

PREV
15
10 స్లాట్లు ఖాళీ.. ప్లేయర్స్ వీరే

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 25.5 కోట్లతో మినీ వేలానికి సిద్దంగా ఉంది. 10 ప్లేయర్ స్లాట్లు(రెండు విదేశీ) ఖాళీగా ఉండగా.. భర్తీ చేయాల్సిన ప్లేయర్స్ చాలానే ఉన్నారు. ముఖ్యంగా ఒక ఇండియన్ స్పిన్నర్, బ్యాకప్ ఓపెనర్, టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌లు, ఏడో నంబర్ ఫినిషర్, మిడిల్ ఓవర్ ఇండియన్ పేసర్, పవర్‌ప్లే ఇండియన్ సీమర్‌లు, బ్యాకప్ పవర్‌ప్లే ఫారెన్ పేసర్ లాంటి ఆటగాళ్లను లక్ష్యంగా బరిలోకి దిగుతోంది SRH.

25
మిల్లర్ పై గురి..

మొదటి సెట్‌లో డేవిడ్ మిల్లర్ కోసం జట్టు ఆసక్తి చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిస్థితులలో అతడి ఫినిషింగ్ సామర్థ్యం.. అలాగే బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎడమచేతి వాటం బ్యాటర్ అవసరం ఉంది. అలాగే కామెరాన్ గ్రీన్‌పై కూడా SRH కన్నేసింది. అయితే వేలంలో అతడు అధిక ధర పలికే ఛాన్స్ ఉండటంతో వెనకడుగు వేయొచ్చు.

35
ఆల్ రౌండర్లు వీరే..

రెండో సెట్‌లో లియామ్ లివింగ్‌స్టోన్‌ను.. మిల్లర్‌కు ప్రత్యామ్నాయంగా లేదా మూడో స్పిన్నర్‌గా పరిగణనలోకి తీసుకోవచ్చు. ప్రస్తుతం అతడు ఫామ్‌లో ఉన్నాడు. దీపక్ హుడా కూడా బ్యాకప్ బ్యాటర్‌గా పనికొస్తాడు. ఇక పేసర్ల విషయానికి వస్తే, ఆకాష్ దీప్ పవర్‌ప్లే బౌలింగ్‌కు బెస్ట్ ఆప్షన్. గెరాల్డ్ కోయెట్జీ, జాకోబ్ డఫ్ఫీ లాంటి విదేశీ పేసర్‌లు తక్కువ ధరకే దొరకవచ్చు.

45
రవి బిష్ణోయ్ లేకపోతే.. ఇండియన్ స్పిన్నర్..

అలాగే స్పిన్నర్ రవి బిష్ణోయ్‌పై కూడా SRH కన్నేసింది. తనుష్ కోటియన్ లాంటి యువ ఆల్ రౌండర్లకు కూడా అవకాశం ఇవ్వొచ్చు. యశ్ ధుల్, ఆర్య దేశాయ్ లాంటి ఓపెనింగ్ బ్యాటర్‌లపై కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. యశ్ ధుల్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో రెండు సెంచరీలు, రంజీల్లో మంచి ప్రదర్శన కనబరిచాడు. ఆర్య దేశాయ్ కూడా దేశీయ సర్క్యూట్‌లో గుజరాత్‌కు కీలక ఆటగాడు.

55
ఆ స్పిన్నర్లు టార్గెట్..

స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్ దొరకకపోతే.. విగ్నేష్ పుతూర్, శివం శుక్లా SRH టార్గెట్లుగా ఉండవచ్చు. ఇక మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, స్టీవ్ స్మిత్ లాంటి క్యాప్డ్ బ్యాటర్‌లు SRHకి అవసరం లేదు. అటు ఫారెన్ స్పిన్నర్‌లు కూడా జట్టుకు అవసరం లేదు. ఇక ఇండియన్ ఫినిషర్‌లు అంకిత్ కుమార్, సల్మాన్ నిజీర్‌పై ఫోకస్ పెట్టనుంది హైదరాబాద్ ఫ్రాంచైజీ.

Read more Photos on
click me!

Recommended Stories