ఎన్ని.. ఎన్ని.. ఎన్ని దారుణాలు సర్.! వట్టి మాటలు కాదు.. వేలంలో చేసి చూపిస్తానంటున్న SRH

Published : Nov 18, 2025, 10:32 AM IST

ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం SRH సిద్ధమవుతోంది. బలమైన దేశీయ స్పిన్నర్ లేకపోవడం, భారతీయ మిడిలార్డర్ బ్యాకప్ అవసరంపై దృష్టి సారించింది. పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వంటి కీలక ఆటగాళ్లను నిలుపుకుంటూనే, పర్సు విలువను పెంచుకుంది.

PREV
15
సర్వం సిద్దం..

గత ఐపీఎల్ సీజన్‌లో ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. కప్పు కొట్టాలంటే బ్యాటింగ్ ఒక్కటే సరిపోదని గుర్తించిన ఎస్‌ఆర్‌హెచ్‌ మేనేజ్‌మెంట్, జట్టు సమతుల్యతను పటిష్టం చేసుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.

25
బ్యాటింగ్ భారం వారిపైనే

జట్టులో బలమైన దేశీయ స్పిన్నర్ లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ లోటును పూడ్చడానికి అనుభవం ఉన్న యువ భారత స్పిన్నర్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాన బ్యాటింగ్ బాధ్యతలు అభిషేక్ శర్మ, క్లాసెన్ చూసుకుంటున్నప్పటికీ, వారికి బ్యాకప్‌గా భారతీయ మిడిలార్డర్ బ్యాటర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

35
కోర్ టీంపై నమ్మకం

మినీ వేలానికి ముందు, ఫ్రాంచైజీలు తమ కోర్ టీమ్‌ను నిలుపుకొని, మిగిలిన లోటుపాట్లను సరి చేసుకోవడానికి కొంతమంది ఆటగాళ్లను విడుదల చేస్తాయి. ఎస్‌ఆర్‌హెచ్‌ మేనేజ్‌మెంట్ తమ పటిష్టమైన కోర్ గ్రూప్‌ను అలాగే ఉంచుకుని.. నిలకడలేమి ఆటగాళ్లను విడుదల చేసింది. గత సీజన్‌లో ఆకట్టుకున్న ఫాస్ట్ బౌలర్లు, పటిష్టమైన ఆల్‌రౌండర్లతో పాటు తమ కెప్టెన్‌ను నిలుపుకుంది.

45
కీలక ఆటగాళ్ల రిటైన్

సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఈ లిస్టులో కెప్టెన్ పాట్ కమిన్స్, స్టార్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్, క్లాసెన్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆల్‌రౌండర్లపై కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ మరోసారి నమ్మకం ఉంచింది.

55
అది వట్టి పుకారు.!

అయితే, ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ క్లాసెన్‌తో విడిపోవచ్చు అనే అతి పెద్ద పుకారు ప్రచారంలో ఉంది. అయితే అదంతా కూడా వట్టి పుకార్లనేని రిటైన్ లిస్టుతో కొట్టిపారేసింది SRH. అవసరం లేని ఆటగాళ్లను విడుదల చేసి ఎస్‌ఆర్‌హెచ్‌ తమ పర్సు విలువను పెంచుకుంది. ఎస్‌ఆర్‌హెచ్‌ తమ పటిష్టమైన బౌలింగ్, విధ్వంసకర బ్యాటింగ్‌ను మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ మినీ వేలాన్ని ఒక గొప్ప అవకాశంగా ఉపయోగించుకోనుంది.

Read more Photos on
click me!

Recommended Stories