SRH రిటైన్ లిస్టు ఇదిగో.. ఆ ముగ్గురిని వదిలేదిలేదన్న కావ్య పాప.. లక్కీ పర్సన్స్ ఎవరంటే.?

Published : Nov 12, 2025, 06:02 PM IST

SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం మొహమ్మద్ షమీ, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్‌లను విడుదల చేయాలని యోచిస్తోంది. నిలకడలేమి, ఫామ్ లేమి కారణంగా రిలీజ్ చేయనుంది.  

PREV
15
మినీ వేలం కోసం వ్యూహాలు..

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం తన వ్యూహాలను సిద్ధం చేస్తోంది. జట్టు యాజమాన్యం మొహమ్మద్ షమీ, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్‌లను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

25
వారే ఫెయిల్యూర్..

గత ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ ప్లేఆఫ్‌లకు చేరకపోవడానికి కొందరు ప్రధాన ఆటగాళ్ల నిరాశాజనక ప్రదర్శనలు ముఖ్య కారణం. అందుకే వారందరినీ విడుదల చేసి.. పర్స్ భారీగా పెంచుకోవాలని చూస్తోంది. ఇక డిసెంబర్ 15న మినీ వేలం జరిగే అవకాశం ఉంది.

35
ప్రధాన పేస్ బౌలర్ ఫెయిల్..

జట్టు ప్రధాన పేస్ బౌలర్ మొహమ్మద్ షమీని రూ. 10 కోట్లకు కొనుగోలు చేసినప్పటికీ, గాయాల బెడదతో అతడు అంచనాలను అందుకోలేకపోయాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను రూ. 11.25 కోట్లకు కొనుగోలు చేయగా ఒకటి రెండు మ్యాచ్‌లు మినహా మిగిలిన అన్నింటిలోనూ విఫలమయ్యాడు.

45
స్పిన్నర్ అవసరమని..

ఇక స్పిన్ విభాగంలో జట్టుకు అవసరమని రాహుల్ చాహర్‌ను రూ. 3.20 కోట్లకు కొనుగోలు చేసింది హైదరాబాద్ జట్టు. అతడి సేవలు ఉపయోగించుకోలేదు గానీ.. ఆడిన ఒకట్రెండు మ్యాచ్‌లు కూడా సరిగ్గా ఆడలేదు. అందుకే డబ్బు ఆదా చేసుకునేందుకు, తమ పర్సు విలువను పెంచుకునేందుకు ఈ ముగ్గురు ఆటగాళ్లను విడుదల చేయాలని హైదరాబాద్ యాజమాన్యం భావిస్తోంది.

55
మావాడే క్లాసెన్..

వీరితో పాటు రూ. 23 కోట్లతో ఉన్న ప్రధాన బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌ను కూడా రిలీజ్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే క్లాసెన్‌ను విడుదల చేసేది లేదని.. అతడు తమ కోర్ టీంలో భాగమని సన్‌రైజర్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. అలాగే యంగ్ ప్లేయర్స్ అయిన పలువురు అన్ క్యాప్డ్ ప్లేయర్స్‌ను సైతం రిలీజ్ చేస్తుందట హైదరాబాద్ యాజమాన్యం.

Read more Photos on
click me!

Recommended Stories