ఐపీఎల్ 2026లో SRH సునామీ.. టాప్ ఆర్డర్ చూస్తేనే దడుసుకుంటారు.. ఎవరెవరంటే.?

Published : Oct 24, 2025, 06:11 PM IST

IPL 2026: ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి ఆటగాళ్లను యాజమాన్యం నిలుపుకునే అవకాశం ఉండగా.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. 

PREV
15
ఐపీఎల్ 2026 ఇలా..

రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2026 మినీ ఆక్షన్ క్రికెట్ అభిమానులకు అతిపెద్ద పండుగ కానుంది. నవంబర్ 15 నాటికి ఆటగాళ్ల ట్రేడింగ్, రిటైన్ లిస్టును ఖరారు చేయనున్నాయి యాజమాన్యాలు. డిసెంబర్ 15లోపు ఆక్షన్ జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టులో గణనీయమైన మార్పులు రానున్నాయి.

25
కీలక ప్లేయర్స్ రిటైన్..

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రధాన బలం వారి దూకుడైన బ్యాటింగ్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ జోడీ ఏ మ్యాచ్‌లోనైనా సులభంగా 200 పరుగుల స్కోర్ చేయగలరు. ఇంటర్నేషనల్ అనుభవం ఉన్న ఈ ఇద్దరు ఓపెనర్లు ఈసారి కూడా జట్టులో కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. నెం. 4లో ప్రపంచ స్థాయి T20 స్పెషలిస్ట్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ SRHకు ప్రధాన బలం కానున్నాడు. మిడిల్ ఆర్డర్‌లో అతని హిట్టింగ్ జట్టుకు కీలకం.

35
అనికేత్ వర్మ అవుట్ ఆఫ్ సిలబస్..

అనికేత్ వర్మ గత సీజన్‌లో SRHకు అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి వచ్చాడు. కేవలం 30 లక్షలకు అతడ్ని కొనుగోలు చేయగా.. హెన్రిచ్ క్లాసెన్ లాంటి హిట్టింగ్ సామర్థ్యాన్ని జట్టుకు అందించాడు. నితీష్ కుమార్ రెడ్డి గతంలో ఫైనల్ వరకు జట్టును తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ కాగా.. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రాణిస్తాడు. కెప్టెన్ పాట్ కమ్మిన్స్ జట్టు స్వరూపాన్ని మార్చేయగలడు.

45
నెంబర్ 3 స్థానంలోనే సందిగ్ధత..

నెం. 3 స్థానం SRHకు ఒక కన్ఫ్యూజన్‌గా మారింది. ఇషాన్ కిషన్‌ను రూ. 11 కోట్లకు కొనుగోలు చేయగా.. అతడు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌లో అభినవ్ మనోహర్ గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. అందువల్ల నెం. 7 స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా మరొక ఆటగాడు రావాల్సి ఉంది. అటు హెన్రిచ్ క్లాసెన్‌ కూడా మూడో స్థానంలో దిగే ఛాన్స్ ఉంది.

55
మార్పులు ఇలా ఉండొచ్చు..

మహమ్మద్ షమీపై జట్టు ఓపెనింగ్ బౌలర్‌గా ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఫిట్‌నెస్ సమస్యలు, ఫామ్ లేమితో సతమతంయ్యాడు. అతని కోసం హైదరాబాద్ జట్టు రూ. 10 కోట్లు వెచ్చించింది. స్పిన్ విభాగం SRHకు ఎప్పుడూ ఒక సమస్యగానే ఉంది. జీషాన్ అన్సారీ, హర్ష్ దూబే వంటి వారిని ప్రయత్నించినప్పటికీ, ఒక మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి నూర్ అహ్మద్ వంటి ఆటగాళ్లు అందుబాటులో ఉంటే, SRH ఒక టాప్ క్లాస్ స్పిన్నర్‌ను కొనుగోలు చేయాలని చూస్తోంది. భారత పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలమైనవి కాబట్టి, ఒక మంచి స్పిన్నర్ జట్టుకు కీలకం.

Read more Photos on
click me!

Recommended Stories