కోహ్లీ రిటైర్ అవుతాడా? రికార్డులు కొడతాడా? : ఈ ప్రశ్నకు గవాస్కర్ ఆన్సర్ ఇదే

Published : Oct 24, 2025, 03:10 PM IST

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలం అవుతున్నాడు. దీంతో ఆయన రిటైర్మెంట్ పై ఊహాగానాలు పెరిగాయి. దీనిపై తాజాగా సునీల్ గవాస్కర్ క్లారిటీ ఇచ్చారు. 

PREV
15
విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై గవాస్కర్ కామెంట్స్

Virat Kohli Retirement: ఆ బ్యాట్ నుండి వేలాది పరుగులు వరదలై పారాయి... సెంచరీ మోతలు మోగాయి. సంక్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్ కు వచ్చి ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించిన క్రికెటర్ అతడు. ఈ ఎలివేషన్ ఎవరిగురించో కాదు… టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించే. అలాంటి ఆటగాడు కేవలం రెండు మ్యాచుల్లో డకౌట్ అయినంతమాత్రాన వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ప్రచారం జోరందుకుంది. ఈ ఊహాగానాలపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ రియాక్ట్ అయ్యారు.

కోహ్లీ అంత త్వరగా ఓటమిని అంగీకరించే రకం కాదు... అతడు మళ్లీ గ్రాండ్ గా కమ్ బ్యాక్ ఇస్తాడని గవాస్కర్ అన్నారు. అతడి సామర్థ్యంపై ఎలాంటి సందేహం వద్దు... ఇంకా ఆ బ్యాటింగ్ లో పదును ఏమాత్రం తగ్గలేదన్నారు. విరాట్ కోహ్లీ మరో రెండేళ్లు వన్డేల్లో కొనసాగడం ఖాయం... కచ్చితంగా 2027 ప్రపంచకప్ ఆడతాడని గవాస్కర్ స్పష్టం చేశారు. కోహ్లీ మరింత కాలం ఆడాలని... టీమిండియాకు మరో వరల్డ్ కప్ అందించాలని ఇండియన్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారని గవాస్కర్ తెలిపారు.

25
కోహ్లీ ఏమాత్రం తగ్గడు...

విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మళ్ళీ ఇప్పుడే టీమిండియాకు ఆడుతున్నాడు… అంటే 7 నెలల విరామం తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సీరిస్ కోసం మైదానంలో అడుగుపెట్టాడు. కాబట్టి అతడు కుదురుకోడానికి కాస్త సమయం అవసరమని సునీల్ గవాస్కర్ తో పాటు టీమిండియా మాజీలు అంటున్నారు. రెండుసార్లు డకౌట్ అయినంతమాత్రాన అతడి కెరీర్ ముగియదు... ఇలాంటి చిన్నచిన్న విషయాలకు కోహ్లీ బెదిరిపోయే రకం కాదంటున్నారు. మళ్లీ కోహ్లీ బ్యాట్ నుండి పరుగులు సునామీ చూస్తామని మాజీలు అభిప్రాయపడుతున్నారు.

35
కోహ్లీకి కలిసిరాని ఆసిస్ టూర్

ఈ ఏడాది మేలో టెస్ట్ క్రికెట్‌కు, గత ఏడాది టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు కోహ్లీ. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటన అతనికి అంతగా కలిసిరాలేదు. పెర్త్, అడిలైడ్‌లలో వరుసగా రెండుసార్లు డకౌట్ అయ్యాడు. దీంతో అతని ఫామ్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి, రిటైర్మెంట్ గురించి చర్చ మొదలయ్యింది.

45
కోహ్లీ గురించి గవాస్కర్ ఏమన్నారంటే...

సునీల్ గవాస్కర్ విరాట్ కోహ్లీకి మద్దతుగా మాట్లాడుతూ... ''అతను ఓటమిని అంగీకరించే ఆటగాడు కాదు. కోహ్లీ 0-0తో ఆగిపోతాడని మీరు అనుకుంటున్నారా? అస్సలు కాదు, అతను తప్పకుండా పుంజుకుంటాడు. విరాట్ ఇప్పటివరకు రిటైర్మెంట్ గురించి ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. కాబట్టి ఇలాంటి ఊహాగానాలు చేయడం తప్పు'' అని గవాస్కర్ అన్నారు.

తర్వాత మ్యాచ్ సిడ్నీలో ఉంది... ఈ సీరిస్ తర్వాత భారత్ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడనుందని గవాస్కర్ గుర్తుచేశారు. ఈ సీరిస్ లే కాదు భవిష్యత్ మరింత క్రికెట్ ఆడేందుకు కోహ్లీ సిద్దంగా ఉన్నారన్నారు. 2027 ప్రపంచకప్ ఇంకా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కోసమే ఉందని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. ఒకవేళ విరాట్ కోహ్లీ తర్వాతి మ్యాచ్‌లో బాగా ఆడితే, అది అతని కెరీర్‌కు కొత్త దిశానిర్దేశం చేస్తుందని... 2027 ప్రపంచకప్‌లో అతని స్థానాన్ని పదిలం చేస్తుందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.

55
సిడ్నీలో విరాట్ కోహ్లీ రికార్డ్ ఎలా ఉంది?

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో విరాట్ కోహ్లీ వన్డే రికార్డ్ సాధారణంగా ఉంది. అతను ఇక్కడ 7 మ్యాచ్‌లు ఆడి 146 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. ఆస్ట్రేలియాపై అతని మొత్తం వన్డే రికార్డును చూస్తే, 31 మ్యాచ్‌లలో 1327 పరుగులు చేశాడు, ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి.

భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో (చివరి) వన్డే అక్టోబర్ 25న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. భారత్ ఇప్పటికే 2-0తో సిరీస్‌ను కోల్పోయింది, కానీ విరాట్ కోహ్లీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో పరుగులు చేయడం చాలా అవసరం. మరి గత మ్యాచుల్లో మాదిరిగా పేలవ ప్రదర్శన చేస్తాడా... లేదంటే పుంజుకుని పరుగుల వరద పారిస్తాడా అన్నది చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories