SRH : ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ క్యాంప్‌లో వేడి మొదలైంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో కెప్టెన్ ఇషాన్ కిషన్‌ను కు యంగ్ ప్లేయర్ వార్నింగ్ ఇచ్చాడు. అసలు కథేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) ప్రారంభానికి వారం రోజుల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ తరుణంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో అంతర్గత పోరు మొదలైనట్లు కనిపిస్తోంది. ఒక ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా జట్టు తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్‌ను అవుట్ చేసిన తర్వాత, అతని సహచర ఆటగాడు దూకుడుగా ప్రవర్తించడమే కాకుండా పెవిలియన్ వైపు వెళ్లాలని సైగలు చేయడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
25
ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఏం జరిగింది?
సన్‌రైజర్స్ హైదరాబాద్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్‌కు శనివారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఊహించని అనుభవం ఎదురైంది. తన స్వంత జట్టు సభ్యుడు, 26 ఏళ్ల లెగ్ స్పిన్నర్ జీషాన్ అన్సారీ కిషన్‌ను అవుట్ చేసిన తర్వాత అత్యుత్సాహం ప్రదర్శించాడు. రెండో ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్‌లో ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు.
ఆ ఓవర్ మొదటి నాలుగు బంతుల్లోనే రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో విరుచుకుపడ్డాడు. అయితే, ఐదో బంతికి జీషాన్ తెలివిగా కిషన్‌ను బోల్తా కొట్టించాడు. కిషన్ ఆడిన షాట్ సరిగ్గా టైమ్ అవ్వకపోవడంతో డీప్ స్క్వేర్ లెగ్‌లో ఉన్న ఫీల్డర్ సులభంగా క్యాచ్ పట్టాడు. వికెట్ తీసిన ఆనందంలో జీషాన్ గట్టిగా అరుస్తూ, కిషన్‌ను పెవిలియన్ వైపు వెళ్లమని గీతలు దాటి ప్రవర్తించాడు. అయితే కిషన్ మాత్రం ఏమాత్రం కోపగించుకోకుండా నవ్వుతూ మైదానాన్ని వీడారు.
35
SRH కొత్త సారథిగా ఇషాన్ కిషన్
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఇషాన్ కిషన్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించింది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇంకా గాయం నుండి పూర్తిగా కోలుకోకపోవడమే ఇందుకు కారణం. కమిన్స్ వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నారు. దీని కారణంగానే ఆయన ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్, టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లకు కూడా దూరమయ్యారు. ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో స్పందిస్తూ, "ప్యాట్ కమిన్స్ ఫిట్‌నెస్ సాధించే వరకు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా ఉంటారు, అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వహిస్తారు" అని స్పష్టం చేసింది.
గత కొంతకాలంగా ఇషాన్ కిషన్ వివిధ ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్నారు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో భారత్ విజేతగా నిలవడంలో కిషన్ కీలక పాత్ర పోషించారు. ఆ టోర్నమెంట్‌లో 9 మ్యాచ్‌లాడి 199.37 స్ట్రైక్ రేట్‌తో 317 పరుగులు చేశారు. 80.25 సగటుతో మూడు అర్ధసెంచరీలు సాధించి, టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా నిలిచారు. అంతేకాకుండా, ఈ సీజన్ ప్రారంభంలో జార్ఖండ్ జట్టుకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని మొదటిసారి అందించడంలో కిషన్ తన కెప్టెన్సీ ప్రతిభను కూడా నిరూపించుకున్నారు.
55
టీ20 ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ హవా
ప్రస్తుతం ఐసీసీ టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో సన్‌రైజర్స్ ఆటగాళ్లదే పైచేయిగా ఉంది. అభిషేక్ శర్మ ప్రపంచ నంబర్ 1 బ్యాటర్‌గా ఉండగా, ఇషాన్ కిషన్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఇంతటి ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ను ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఒక యువ బౌలర్ అలా అవమానించడం అభిమానులకు నచ్చడం లేదు. పది ఏళ్ల క్రితం (2016) ఐపీఎల్ టైటిల్ గెలిచిన హైదరాబాద్, ఈసారి మళ్ళీ కప్పు కొట్టాలని పట్టుదలతో ఉంది. కానీ సీజన్ మొదలవ్వకముందే జట్టులో ఇలాంటి గొడవలు జరగడం టీమ్ మేనేజ్‌మెంట్‌కు సవాలుగా మారింది.