SRH 2026 ఒకటి స్ట్రాంగ్.. ఒకటి వీక్.. మరి కావ్య పాప ప్లాన్ ఇదేనా.!

Published : Mar 22, 2026, 08:59 AM IST

SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 ఏళ్ల ఐపీఎల్ టైటిల్ నిరీక్షణకు తెరదించాలని ఓనర్ కావ్య మారన్ పక్కా ప్లాన్ సిద్ధం చేశారు. 2026 సీజన్ కోసం ఐదుగురు స్టార్ ప్లేయర్లపై కోట్లాది రూపాయలు వెచ్చించి, వారిపైనే తన పూర్తి నమ్మకాన్ని ఉంచారు. 

PREV
15
కావ్య మారన్ నమ్మకం ఆ ఐదుగురిపైనే..

ఐపీఎల్ 2026 సీజన్ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. 2016లో చివరిసారిగా ఛాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, పదేళ్ల తర్వాత మళ్ళీ ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని పట్టుదలతో ఉంది. ఇందుకోసం ఓనర్ కావ్య మారన్ ఐదుగురు విధ్వంసకర ఆటగాళ్లను జట్టులో అట్టిపెట్టుకుని, వారిపైనే గెలుపు భారమంతా వేశారు.

25
ఇషాన్ కిషన్(కెప్టెన్ - ప్రారంభ మ్యాచ్‌లు)

వ్యక్తిగత కారణాల వల్ల ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేని సమయంలో, ఇషాన్ కిషన్ జట్టును నడిపించనున్నాడు. గత సీజన్‌లో 11.25 కోట్లకు SRH అతడిని కొనుగోలు చేసింది. టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యుడైన ఇషాన్, ఓపెనర్‌గా జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.

35
విధ్వంసకర ఓపెనర్లు

ట్రావిస్ హెడ్

ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ గత రెండు సీజన్లుగా హైదరాబాద్ జట్టుకు వెన్నెముకగా మారాడు. పవర్ ప్లే ఓవర్లలో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే హెడ్ కోసం కావ్య మారన్ 14 కోట్ల భారీ పారితోషకాన్ని అందిస్తోంది. ఇతడు ఇప్పటివరకు 28 మ్యాచుల్లో 941 పరుగులు సాధించాడు.

అభిషేక్ శర్మ

ప్రస్తుత టీ20 ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా వెలుగొందుతున్న అభిషేక్ శర్మ, గత ఏడేళ్లుగా హైదరాబాద్ జట్టుతోనే ప్రయాణం చేస్తున్నాడు. ఎస్ఆర్హెచ్ తరపున అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా నిలిచిన ఇతడికి ఈసారి 14 కోట్ల జీతం దక్కనుంది. అటు జట్టు జట్టు ప్రధాన కెప్టెన్ అయిన కమిన్స్, బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ విభాగంలోనూ జట్టుకు అండగా నిలవనున్నాడు. కమిన్స్ కోసం ఎస్ఆర్హెచ్ 18 కోట్లు వెచ్చిస్తోంది.

45
హెన్రీచ్ క్లాసెన్

హైదరాబాద్ జట్టులోని అతిపెద్ద మ్యాచ్ విన్నర్లలో క్లాసెన్ ఒకడు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన ఇతడిపై నమ్మకంతో ఎస్ఆర్హెచ్ ఏకంగా 23 కోట్లు చెల్లిస్తోంది. క్లాసెన్ 173.49 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించగల సామర్థ్యం ఉంది.

55
జట్టు పరిస్థితి

సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ విభాగం ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టన్‌లతో అత్యంత పటిష్టంగా ఉంది. అయితే, బౌలింగ్ విభాగంలో హర్షల్ పటేల్ తప్ప ఇతర స్టార్ బౌలర్లు లేకపోవడం కొంత ఆందోళన కలిగించే అంశం. ఈ టాప్-5 బ్యాటర్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories