పలాష్ ముచ్చల్ మోసం చేశారనే ఆరోపణల మధ్య, స్మృతి మంధానా వివాహం గురించి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివాహం వాయిదా పడిన ఒక వారం తర్వాత 'క్రేయాన్స్ ఎంటర్‌టైన్‌మెంట్' అనే ఈవెంట్ కంపెనీ తన సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌ను షేర్ చేసింది.
ఈ పోస్ట్ ద్వారా, పలాష్ , స్మృతి మంధానాల వివాహం గురించి పెద్ద క్లూ ఇచ్చారు. పోస్ట్‌లో జంట పేర్లను నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఈ కంపెనీ స్మృతి మంధానా, పలాష్ ముచ్చల్ వివాహం గురించే పరోక్షంగా చెబుతోందని నెటిజన్లు భావిస్తున్నారు.
ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ పోస్ట్‌లో, "జీవితంలోని ప్రతి మ్యాచ్‌లోనూ మనం గెలిచి ఫైనల్ లైన్‌ను దాటలేము, కానీ క్రీడా స్ఫూర్తి ఎల్లప్పుడూ ముఖ్యం. మా బృందం సంతోషంగా, గర్వంగా శ్రమించింది. అది తప్పకుండా ప్రస్తావించదగిన విషయం. ఛాంపియన్స్, త్వరలో కలుద్దాం" అని పేర్కొంది. ఈ పోస్ట్ స్మృతి, పలాష్ వివాహం త్వరలో జరగవచ్చనే సూచన అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.