Joe Root : సచిన్ సాధించలేని రికార్డులు.. జో రూట్ అదరగొట్టాడు !

Published : Dec 05, 2025, 03:09 PM IST

Joe Root : టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ దుమ్మురేపుతున్నాడు. యాషెస్‌ సిరీస్‌లో ఆసీస్ పై అద్భుతమైన సెంచరీ బాదాడు. ఈ క్రమంలోనే లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ సాధించలేని మూడు ప్రత్యేక రికార్డులను జో రూట్ సాధించాడు.

PREV
15
యాషెస్‌ సిరీస్‌: సెంచరీతో కంగారెత్తించిన జో రూట్

ఇంగ్లాండ్‌కు చెందిన దిగ్గజ బ్యాటర్ జో రూట్ టెస్ట్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్నాడు. రికార్డుల రారాజు సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడానికి రూట్ కేవలం 2235 పరుగులు దూరంలో ఉన్నాడు. రూట్ టెస్ట్ క్రికెట్‌లో రెండో అత్యధిక రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అయితే, ఇప్పటికే రూట్ తన అద్భుతమైన టెస్ట్ కెరీర్‌లో సచిన్ సాధించలేని మూడు ప్రత్యేక రికార్డులను కూడా సాధించాడు.

రూట్, తన 34 ఏళ్ల వయసులో బ్రిస్బేన్‌లోని రెండో యాషెస్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై యాషెస్‌ సెంచరీని నమోదు చేసి 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. దీంతో, సచిన్ అత్యధిక పరుగుల ప్రపంచ రికార్డును రూట్ బ్రేక్ చేయగలడా అనే చర్చ మరోసారి మొదలైంది. తన 160 టెస్ట్ మ్యాచ్‌ల కెరీర్‌లో రూట్ ఇప్పటికే ఈ సుదీర్ఘ ఫార్మాట్‌లో ఎన్నో ఘనతలు సాధించాడు. సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో సాధించలేని, రూట్ నెలకొల్పిన మూడు రికార్డులు వివరాలు గమనిస్తే..

25
అత్యధిక వరుస టెస్ట్‌లలో 50-ప్లస్ స్కోర్లు

టెస్ట్ క్రికెట్‌లో నిలకడ అనేది విజయవంతమైన కెరీర్‌కు కీలకం. రూట్, సచిన్ ఇద్దరూ తమ కెరీర్‌లో నిలకడను ప్రదర్శించారు. సచిన్ తన కెరీర్‌లో వరుసగా 10 టెస్ట్‌లలో యాభై లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించాడు. ఈ పరంపర డిసెంబర్ 2009లో మొదలై అక్టోబర్ 2010తో ముగిసింది.

అయితే, జో రూట్ ఒక అడుగు ముందుకు వేసి ఈ విభాగంలో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతను వరుసగా 12 టెస్ట్ మ్యాచ్‌లలో యాభై-ప్లస్ స్కోర్లను నమోదు చేశాడు. ఈ ఘనతను రూట్ అక్టోబర్ 2016 నుండి ఆగస్టు 2017 మధ్య సాధించాడు.

35
ఒకే టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీ

సచిన్ టెండూల్కర్ తన టెస్ట్ కెరీర్‌లో అద్భుతమైన 51 సెంచరీలు సాధించినప్పటికీ, అతను ఒకే టెస్ట్ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీ చేయలేకపోయాడు.

కానీ, జో రూట్ ఈ ప్రత్యేక ఘనతను సాధించాడు. అతను ఆగస్టు 2024లో లార్డ్స్‌లో శ్రీలంకపై జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు నమోదు చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 143 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 103 పరుగులు చేసి ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

45
టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు

సచిన్ టెండూల్కర్ తన 200 టెస్ట్ మ్యాచ్‌ల కెరీర్‌ను కేవలం 115 క్యాచ్‌లతో ముగించాడు. ఈ సంఖ్య టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప ఫీల్డర్ మార్కుకు చాలా దూరంగా ఉంది.

మరోవైపు, జో రూట్ ఇప్పటికే టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్‌కు ఆడుతూ 213 అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ రికార్డును ఇప్పట్లో బద్దలు కొట్టడం కష్టమే అని విశ్లేషకులు చెబుతున్నారు.

55
12 ఏళ్ల నిరీక్షణ.. బ్రిస్బేన్‌లో రూట్ సెంచరీ

స్కాట్ బోలాండ్ బౌలింగ్ లో పరుగులు చేసి బ్రిస్బేన్‌లో రూట్ సెంచరీ కొట్టాడు. సరిగ్గా 12 ఏళ్ల క్రితం, ఇదే గ్రౌండ్‌లో తన తొలి యాషెస్ పర్యటనలో ఆడిన మొదటి బంతిని మిస్ అయిన క్షణం నుండి ఈ నిరీక్షణ మొదలైంది. 2013లో 22 ఏళ్ల యువకుడిగా గబ్బాలోకి అడుగుపెట్టిన రూట్ ఇప్పుడు ప్రపంచ క్రికెట్ లో తనదైన ముద్ర వేస్తున్నాడు.

ఈ ఏడాది రూట్‌కు ఇది నాల్గవ సెంచరీ, 2024 ప్రారంభం నుండి ఇది పదవ సెంచరీ. కాగా, ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 334 పరుగులకు ఆలౌట్ అయింది. జో రూట్ 138* పరుగుల తన ఇన్నింగ్స్ లో 15 ఫోర్లు, ఒక సిక్సర్ తో బాదాడు.

Read more Photos on
click me!

Recommended Stories