టీ20 ప్రపంచకప్ నుంచి గిల్‌పై వేటుకు ఇదే కారణం.. పూర్తి వివరాలు ఇవిగో

Published : Dec 22, 2025, 09:08 PM IST

Shubman Gill: టీ20 వరల్డ్ కప్ 2026 కోసం భారత జట్టు నుండి యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ ను తప్పించడం చర్చనీయాంశమైంది. అతని ఇటీవలి ఫామ్, టోర్నమెంట్ పిచ్‌ల స్వభావం, అగ్రెసివ్ ఓపెనర్ల అవసరం ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణాలని తెలుస్తోంది. 

PREV
15
సెలెక్టర్ల అసంతృప్తి..

టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధికారికంగా జట్టును ప్రకటించింది. అయితే, ఈ ప్రకటనతో యువ ఆటగాడు శుభ్‌మాన్ గిల్ అభిమానుల్లో నిరాశ నెలకొంది. నిరంతరం భారత జట్టులో కీలక సభ్యుడిగా, వైస్ కెప్టెన్‌గా కొనసాగిన గిల్ ను ఈ టోర్నమెంట్ జట్టు నుంచి పూర్తిగా తప్పించారు. ఈ నిర్ణయం వెనుక గిల్ ఇటీవలి ఫామ్ పై సెలెక్టర్ల అసంతృప్తి ఒక కారణమని స్పష్టమైంది. కానీ, అదే కాకుండా మరికొన్ని వ్యూహాత్మక కారణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

25
గిల్ ను దూరం పెట్టారు..

గిల్ ను దూరం పెట్టడంలో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు జరిగే పిచ్ ల స్వభావం కీలక పాత్ర పోషించాయని సమాచారం. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న ఈ మెగా టోర్నీలో, భారత్ తన ప్రతీ మ్యాచ్ ను వేర్వేరు పిచ్ లపై ఆడనుంది. టోర్నమెంట్ ముందుకు సాగేకొద్దీ పిచ్ లు నెమ్మదిగా మారే అవకాశం ఉందని అంచనాలున్నాయి

35
గిల్ ఉద్వాసన వెనుక కారణం ఇదే

అలాంటి పరిస్థితుల్లో, మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడంలో పవర్ ప్లే లో వేగంగా పరుగులు రాబట్టడం అత్యంత కీలకం. గిల్ ప్రస్తుత ఫామ్ పై అనుమానాలు, ఇటీవలి మ్యాచ్‌లలో అతని వైఫల్యాలు సెలెక్టర్లలో ఆందోళన కలిగించాయి. దీంతో, గిల్ కంటే ఓపెనింగ్ స్థానంలో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి దూకుడు స్వభావం గల ఆటగాళ్ల అగ్రెసివ్ ఆటతీరుపై సెలెక్టర్లు ఎక్కువ నమ్మకం ఉంచినట్లు తెలుస్తోంది.

45
అగార్కర్ వ్యాఖ్యలు ఇవే..

అయితే, బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ గిల్ ను జట్టులోకి తీసుకోకపోవడానికి మరో కారణాన్ని పేర్కొన్నారు. జట్టు కాంబినేషన్ల కారణంగానే గిల్ తన స్థానాన్ని కోల్పోయాడని ఆయన మీడియా సమావేశంలో వివరించారు. 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసేటప్పుడు, ఎవరో ఒకరు జట్టులో స్థానం కోల్పోవాల్సి ఉంటుందని, దురదృష్టవశాత్తు అది గిల్ అని ఆయన తెలిపారు. గిల్ మంచి ఆటగాడు కాదని దీని అర్థం కాదని అగార్కర్ స్పష్టం చేశారు.

55
టీ20 వరల్డ్ కప్ అప్పుడే..

మరోవైపు, జట్టులో ఫినిషర్ పాత్ర విషయంలో హార్దిక్ పాండ్యాపై టీమ్ ఇండియా ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ భారాన్ని తగ్గించడంలో సహాయపడటానికి రింకూ సింగ్ ను తిరిగి జట్టులోకి తీసుకోవడం ముఖ్యమని సెలెక్టర్లు భావించారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది.

Read more Photos on
click me!

Recommended Stories