అయ్యర్ ఒక్కడే ఎందుకిలా.! కివీస్‌తో టీ20 సిరీస్‌కి ప్లేయింగ్ ఎలెవన్‌లో దక్కని చోటు

Published : Jan 28, 2026, 11:30 AM IST

Shreyas Iyer: భారత జట్టు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడుతుండగా, శ్రేయస్ అయ్యర్ ఒక్కడే ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. తిలక్ వర్మ గాయం కారణంగా తాత్కాలికంగా ఎంపికైన అయ్యర్, వరల్డ్ కప్ ప్రణాళికల్లో లేడు.  

PREV
15
అయ్యర్ ఒక్కడే ఎందుకిలా.!

టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆడుతోంది. ఈ సిరీస్‌లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే జరిగిన మూడు మ్యాచ్‌లలో విజయం సాధించి, 3-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ విజయ పరంపరలో భాగంగా, భారత జట్టు మూడో టీ20 మ్యాచ్‌లో కొన్ని కీలక మార్పులు చేసింది. గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది.

25
రెండో టీ20 మ్యాచ్‌కు..

రెండో టీ20 మ్యాచ్‌కు దూరమైన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడో టీ20కి జట్టులోకి తిరిగి వచ్చాడు. అతనితో పాటు, యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కింది. ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి కల్పించారు.

35
15 మంది సభ్యుల స్క్వాడ్‌లో..

ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన మూడు టీ20 మ్యాచ్‌లను పరిశీలిస్తే, 15 మంది సభ్యుల స్క్వాడ్‌లో శ్రేయస్ అయ్యర్‌ను మినహాయిస్తే 14 మంది ఆటగాళ్లకు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడే అవకాశం లభించింది. దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో జట్టు కూర్పుపై దృష్టి సారిస్తున్నారు. భారత టీ20 జట్టులో ఉన్న తిలక్ వర్మకు విజయ్ హజారే ట్రోఫీలో గాయం కావడంతో అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు.

45
అయ్యర్‌పై మరోసారి వేటు ..

అయితే, శ్రేయస్ కేవలం న్యూజిలాండ్‌తో జరగబోయే తొలి మూడు టీ20 సిరీస్‌లకు మాత్రమే ఎంపికయ్యాడు. అతను వరల్డ్ కప్ జట్టులో ఆడే అవకాశాలు లేవు. తిలక్ వర్మ గాయం నుంచి కోలుకుని టీమిండియాలోకి తిరిగి వస్తే, శ్రేయస్ అయ్యర్‌పై మరోసారి వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది.

55
వరల్డ్ కప్ స్క్వాడ్‌లో లేకపోవడం..

వరల్డ్ కప్ స్క్వాడ్‌లో లేకపోవడం, కేవలం తాత్కాలికంగా ఎంపిక కావడంతో శ్రేయస్ అయ్యర్‌కు న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం దక్కే ఛాన్స్ తక్కువగా ఉంది. గాయపడిన తిలక్ వర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన అయ్యర్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కే అవకాశాలు దాదాపు లేవని చెప్పవచ్చు. మరోవైపు, రవి బిష్ణోయ్ పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. అతను వరల్డ్ కప్ స్క్వాడ్‌లో లేకపోయినా, ప్లేయింగ్ ఎలెవన్‌లో ఛాన్స్ దక్కింది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో జట్టులోకి వచ్చిన బిష్ణోయ్ వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories