వర్త్.. 'వర్మ'.. వర్త్.! టీ20 'కోహ్లీ' కోసం బీసీసీఐ స్పెషల్ ప్లాన్..

Published : Jan 28, 2026, 11:00 AM IST

Tilak Varma: భారత యువ ఆటగాడు తిలక్ వర్మ కోలుకుని న్యూజిలాండ్‌తో ఐదో టీ20కి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. 2026 టీ20 ప్రపంచ కప్‌కు అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాలని బీసీసీఐ ప్రత్యేక ప్రణాళికతో ఉంది.  

PREV
15
తిలక్ ఆగమనం

భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ గాయం నుంచి కోలుకుంటున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగే ఐదవ టీ20 మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, 2026 టీ20 ప్రపంచ కప్‌కు కూడా అతడు పూర్తిగా ఫిట్‌గా ఉంటాడని సమాచారం.

25
భారత జట్టుకు పెద్ద బూస్ట్‌

తిలక్ పూర్తి ఫిట్‌నెస్ సాధించడం భారత జట్టుకు పెద్ద బూస్ట్‌గా మారనుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో తిలక్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ టీమ్ ఇండియాకు అద్భుత విజయాలు అందిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొందరపాటుతో తిలక్ వర్మను ఆడించడం లేదట.

35
తిలక్ వర్మకు అబ్డోమినల్ సర్జరీ

2026 ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని తిలక్ పూర్తిగా కోలుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోందట. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తిలక్ తీవ్రంగా శ్రమిస్తూ పునరావాసం పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీ సమయంలో తిలక్ వర్మకు అబ్డోమినల్ సర్జరీ జరిగింది. కనీసం రెండు వారాల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో న్యూజిలాండ్‌తో తొలి మూడు టీ20 మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు.

45
తిలక్ గైర్హాజరీతో నాలుగో టీ20లో..

గతంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ, తిలక్ వర్మ తొలి మూడు టీ20లకు అందుబాటులో ఉండరని, మిగిలిన రెండు మ్యాచ్‌లకు అతని ఫిట్‌నెస్‌ను బట్టి పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. అయితే తిలక్ గైర్హాజరీతో నాలుగో టీ20లో సైతం సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లకు మరో అవకాశం దక్కనుంది.

55
ఆసియా కప్‌లో తిలక్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్..

గాయానికి ముందు 2025 ఆసియా కప్‌లో తిలక్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. అందుకే ఫిట్‌నెస్ సాధించిన వెంటనే తుది జట్టులోకి నేరుగా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న కిషన్ లేదా ఫస్ట్ ఛాయిస్ అయినప్పటికీ, ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న శాంసన్ స్థానంలో తిలక్ ఆడే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories