Sanju Samson: టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు ఎంపికలో సంజు శాంసన్ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. ఓపెనర్‌గా అతని పేలవ ఫామ్, ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనతో మేనేజ్‌మెంట్ పాలుపోలేని స్థితిలో పడింది. రాబోయే మ్యాచ్‌లలో సంజు పుంజుకోకపోతే..
టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు కూర్పు, ముఖ్యంగా ఓపెనింగ్ స్థానాల ఎంపిక ప్రక్రియ అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. ఈ చర్చల కేంద్ర బిందువుగా సంజు శాంసన్ మారాడు. తొలుత అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే ఆటగాడిగా శుభమన్ గిల్ స్థానంలో సెలెక్టర్లు సంజు వైపు మొగ్గు చూపారు. 2024లో బంగ్లాదేశ్‌పై 111 పరుగులు, దక్షిణాఫ్రికాపై 109 పరుగులు చేసి సంజు తన అసాధారణ స్ట్రైక్ రేట్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు.
25
2025 ఆసియా కప్ సమయంలో..
అయితే, సమీకరణాలు త్వరగానే మారాయి. 2025 ఆసియా కప్ సమయంలో శుభమన్ గిల్ పునరాగమనంతో, సంజును మిడిల్ ఆర్డర్‌కు పంపారు. అక్కడ అతను విఫలం కావడమే కాకుండా, ఫినిషర్‌గా జితేష్ శర్మ మెరుగైన ప్రత్యామ్నాయంగా కనిపించాడు. ప్రపంచకప్ చర్చల సమయానికి గిల్ ఫామ్ కోల్పోవడం, మరోవైపు ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో మళ్లీ మార్పులు చోటుచేసుకున్నాయి. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సంజును తిరిగి ఓపెనర్‌గా ఎంపిక చేసి, గిల్‌ను పక్కన పెట్టింది.
35
ఓపెనర్‌గా ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌లలో..
కానీ ప్రస్తుతం సంజు శాంసన్ ఫామ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత 12 నెలలుగా ఓపెనర్‌గా ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌లలో ఎనిమిది సార్లు పవర్ ప్లేలోనే అవుట్ కావడం, కేవలం 11.55 సగటును నమోదు చేయడం అతని స్థానాన్ని తీవ్రంగా ప్రశ్నార్థకం చేస్తోంది. ఇటీవలే గువాహటిలో జరిగిన మూడో టీ20లో గోల్డెన్ డక్ అవుట్ అవ్వడం అతని సమస్యను మరింత జటిలం చేసింది.
భారత టీ20 బ్యాటింగ్ లైనప్‌లో సంజు వైఫల్యం ఒకవైపు అయితే, ఇషాన్ కిషన్ అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడం జట్టులో కొత్త పోటీని సృష్టిస్తోంది. తిలక్ వర్మ గాయం కారణంగా ఇషాన్ కిషన్ ఈ సిరీస్‌లో ఆడే అవకాశం పొంది, అభిషేక్ శర్మతో కలిసి విధ్వంసక భాగస్వామ్యాలను నెలకొలుపుతున్నాడు. ముఖ్యంగా గువాహటిలో ఆరు ఓవర్లలో 94 పరుగులు చేయడంలో ఇషాన్ పాత్ర కీలకమైంది. ఇది సంజు శాంసన్ ఓపెనింగ్ స్థానానికి పెను సవాలుగా మారింది.
55
ఇషాన్ కిషన్‌ను ప్రమోట్ చేస్తారా..
మరోవైపు, ప్రపంచ నంబర్ త్రీ బ్యాటర్ అయిన తిలక్ వర్మ నాలుగో టీ20లో తిరిగి జట్టులోకి వస్తుండటంతో వన్ డౌన్ స్థానం భర్తీ అవుతుంది. అప్పుడు ఓపెనింగ్ స్థానంలో వరుసగా విఫలమవుతున్న సంజును కొనసాగిస్తారా లేదా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ను ప్రమోట్ చేస్తారా అనేది మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. సూర్యకుమార్ యాదవ్ తన ఫామ్‌ను తిరిగి పొందినట్లే, వైజాగ్ మరియు తిరువనంతపురంలో జరగనున్న మ్యాచ్‌లలో సంజు కూడా పుంజుకుంటాడని జట్టు మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. ఒకవేళ సంజు ఈ రెండు మ్యాచ్‌లలోనూ విఫలమైతే, ప్రపంచకప్ ప్రారంభానికి ముందే భారత్ తన ఓపెనింగ్ జోడీపై కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.