Team India Captain : భారత టీ20 జట్టు పగ్గాలను శ్రేయాస్ అయ్యర్‌కు అప్పగించే యోచనలో బీసీసీఐ ఉంది. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఆందోళన కలిగిస్తుండటంతో ఈ కీలక మార్పులకు బీసీసీఐ సిద్ధమైందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
టీమ్ ఇండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్? సూర్యకుమార్ యాదవ్‌కు పొగ పడ్డట్టేనా
భారత క్రికెట్‌లో మరో భారీ మార్పుకు రంగం సిద్ధమవుతోందా? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. టీ20 ఫార్మాట్‌లో టీమ్ ఇండియా పగ్గాలను శ్రేయాస్ అయ్యర్‌కు అప్పగించే దిశగా సెలెక్టర్లు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం టీ20 కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఆందోళనకరంగా ఉండటం, అలాగే భవిష్యత్తు ప్రణాళికల దృష్ట్యా అయ్యర్‌ను కెప్టెన్సీ రేసులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026లో అయ్యర్ అద్భుత ప్రదర్శన ఈ నిర్ణయానికి ప్రధాన కారణం కానుంది.
26
సూర్యకుమార్ యాదవ్‌కు గడ్డుకాలం?
ప్రస్తుత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ బీసీసీఐ సెలెక్టర్లను కలవరపెడుతోంది. అటు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున, ఇటు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ ఆశించిన రీతిలో రాణించలేకపోతుండటంతో ఆయన కెప్టెన్సీపై నీలినీడలు కమ్ముకున్నాయి.
2028లో జరగబోయే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్, తదుపరి టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఒక నమ్మకమైన నాయకుడిని ఎంచుకోవాలని బోర్డు భావిస్తోంది. సూర్యకుమార్ స్థానంలో న్యూబ్లడ్ కు అవకాశం ఇవ్వాలని మేనేజ్‌మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం.
36
ఐపీఎల్‌లో శ్రేయాస్ అయ్యర్ ప్రభంజనం
పంజాబ్ కింగ్స్ (PBKS) కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఈ సీజన్‌లో పంజాబ్ జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిని గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు పంజాబ్ ఓటమి ఎరుగకుండా దూసుకుపోవడంలో అయ్యర్ కెప్టెన్సీ, బ్యాటింగ్ కీలక పాత్ర పోషించాయి. ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) కెప్టెన్‌గా ప్రయాణం మొదలుపెట్టి, కేకేఆర్‌కు 2024లో టైటిల్ అందించిన ఘనత ఆయనది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌ను కూడా ఫైనల్ వరకు తీసుకువెళ్లి తన నాయకత్వ పటిమను మరోసారి నిరూపించుకున్నారు.
పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్‌తో శ్రేయాస్ అయ్యర్‌కు మంచి అనుబంధం ఉంది. వీరిద్దరి కాంబినేషన్ జట్టుకు అద్భుత ఫలితాలను ఇస్తోంది. అయ్యర్ కెప్టెన్సీలో బ్యాటింగ్ మరింత మెరుగవుతుందని కోచింగ్ స్టాఫ్ అభిప్రాయపడుతున్నారు. "అతను తన బలహీనతలను అధిగమించి ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అయ్యర్ ప్రణాళికాబద్ధంగా ఉండటమే కాకుండా, మైదానంలో తన అంతరాత్మ చెప్పినట్లు నిర్ణయాలు తీసుకుంటాడు. ఇది జట్టుకు కలిసొస్తోంది" అని పంజాబ్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ ప్రశంసించారు.
56
2023 తర్వాత రీఎంట్రీ దిశగా..
శ్రేయాస్ అయ్యర్ చివరిసారిగా 2023లో టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉన్నాడు. "చాలా కాలంగా టీ20 జట్టులో లేని ఆటగాడిని నేరుగా తీసుకొచ్చి కెప్టెన్సీ అప్పగించడం పెద్ద నిర్ణయమే. అయితే, ప్రస్తుతం అందరి దృష్టి 2027 వన్డే ప్రపంచకప్‌పై ఉంది. దీంతో టీ20 నాయకత్వ మార్పు విషయంలో సెలెక్టర్లకు తగినంత సమయం దొరికింది" అని బీసీసీఐ వర్గాలు తెలిపినట్టు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న అయ్యర్, త్వరలోనే టీ20 బాధ్యతలు చేపడతారని గట్టిగా వినిపిస్తోంది.
66
అయ్యర్ నాయకత్వ లక్షణాలపై ప్రశంసలు
అయ్యర్ నాయకత్వ శైలిపై జేమ్స్ హోప్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రిక్కీ పాంటింగ్ వంటి దిగ్గజ కోచ్ ముందు కూడా తన అభిప్రాయాలను నిర్భయంగా చెప్పే స్థాయికి అయ్యర్ ఎదిగాడని ఆయన పేర్కొన్నారు. కేవలం బ్యాటర్‌గానే కాకుండా, ఫీల్డ్ సెట్టింగ్‌లు, బౌలింగ్ మార్పులలో అయ్యర్ చూపిస్తున్న చొరవ అతడిని రేసులో ముందుంచింది. 31 ఏళ్ల వయసులో ఉన్న అయ్యర్, తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండటం భారత్‌కు సానుకూల అంశం.