Interesting Facts : కోట్లు సంపాదించే క్రికెటర్లు చిరిగిన షూస్ ఎందుకు వేసుకుంటారో తెలుసా..?

Published : Apr 18, 2026, 08:48 PM IST

క్రికెట్ చూసేటప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా..? కొందర ఫాస్ట్ బౌలర్ల షూస్ చిరిగిపోయి ఉంటాయి. కోట్లకు కోట్లు సంపాదించే ఇంటర్నేషనల్ క్రికెటర్లు చిరిగిన షూస్ వేసుకోవడం ఏమిటని ఆశ్చర్యం కలుగుతుంది. అయితే దీని వెనుక ఓ ముఖ్యమైన కారణం ఉంది.  

PREV
14
బౌలర్ల షూస్ ఎందుకు చిరిగివుంటాయి..?

Cricket :  ఇంటర్నేషనల్ క్రికెట్లో ఫాస్ట్ బౌలర్లు వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని విసురుతుంటారు. ఇలా బౌలింగ్ చేసేటప్పుడు ల్యాండ్ అయ్యే కాలు నేలను బలంగా తాకుతుంది. అప్పుడు వాళ్ల బొటనవేలు షూ లోపల ముందు భాగానికి గట్టిగా తగులుతుంది.

24
దీనివల్ల ఏమవుతుంది..?

ఇలా పదేపదే బొటనవేలు షూస్ ముందుభాగాన్ని తాకడం బౌలర్లను గాయపర్చవచ్చు. కాలి బొటనవేలుపై ఒత్తిడి పెరిగి తీవ్రమైన నొప్పి వస్తుంది. కొన్నిసార్లు గోరు ఊడిపోవడం, ఇన్ఫెక్షన్ రావడం వంటివి కూడా జరుగుతాయి.

34
బౌలర్లు షూస్ అందుకే చించుతారు...

ఇలా బౌలింగ్ సమసంలో తలెత్తే సమస్య నుంచి బయటపడటానికే బౌలర్లు చిరిగిన షూస్ వేస్తారు. కావాలనే మైదానంలో ఉపయోగించే స్పోర్ట్స్ షూస్ ముందుభాగాన్ని కత్తిరిస్తారు. దీనివల్ల బొటనవేలు ఫ్రీగా కదలడానికి స్థలం దొరుకుతుంది. కాలుకు ఇబ్బంది లేకుండా సౌకర్యంగా ఉంటుంది.

44
విచిత్రంగా ఉన్నా బెస్ట్ పరిష్కారం..!

క్రికెటర్లు గాయం నుండి భయపడేందుకు షూస్ ను చించడం చూడటానికి కొంచెం వింతగా అనిపిస్తుంది. కానీ ఫాస్ట్ బౌలర్లు ఎదుర్కొనే ఈ తీవ్రమైన సమస్యకు ఇది ఒక తెలివైన పరిష్కారం. అందుకే చాలామంది బౌలర్లు చిరిగిన షూస్ తో ఆడటం చూస్తుంటాం. 

Read more Photos on
click me!

Recommended Stories