టీమిండియాకు బిగ్ షాక్.. అయ్యో అయ్యర్ భయ్యా ఇలా జరిగిందేంటి !

Published : Oct 25, 2025, 12:39 PM IST

Shreyas Iyer : సిడ్నీ వన్డేలో శ్రేయస్ అయ్యర్ అద్భుత క్యాచ్ పట్టాడు. ఈ సమయంలో గాయపడి గ్రౌండ్ ను వీడాడు. అలెక్స్ క్యారిని ఔట్ చేస్తూ గాయపడ్డ అయ్యార్ పరిస్థితి  పై ఆందోళన వ్యక్తమవుతోంది.

PREV
15
సిడ్నీ వేదికగా కీలక మ్యాచ్.. శ్రేయాస్ అయ్యర్ కు గాయం

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆఖరి పోరు శనివారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. సిరీస్‌ను ఇప్పటికే 2-0తో కోల్పోయిన భారత్ కనీసం ఈ మ్యాచ్‌ను గెలిచి వైట్‌వాష్‌ను తప్పించుకోవాలనుకుంటోంది. అయితే, ఈ కీలక మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ గాయంతో భారత్ కు షాక్ తగిలింది.

25
కపిల్‌దేవ్ స్టైల్ క్యాచ్… వెంటనే అయ్యర్ కు గాయం

ఈ మ్యాచ్ లో 34వ ఓవర్‌లో భారత వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చూపించిన అథ్లెటిక్ స్టైల్ ఫీల్డింగ్ మ్యాచ్‌లో హైలెట్ గా నిలిచింది. హర్షిత్ రాణా వేసిన నాలుగో బంతిని అలెక్స్ క్యారీ లెగ్‌సైడ్ వైపు కొట్టే ప్రయత్నంలో బ్యాట్ ఎడ్జ్ కు తగలడంతో థర్డ్‌మాన్ దిశగా గాల్లోకి ఎగిరింది.

బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న శ్రేయస్ అయ్యార్… వెనక్కు పరుగెత్తుతూ అద్భుతంగా క్యాచ్‌ను పూర్తి చేశారు. ఈ క్యాచ్ ఫ్యాన్స్‌కు కపిల్ దేవ్ గుర్తు తెచ్చింది.

అయితే క్యాచ్ పూర్తయ్యిన తర్వాత శ్రేయస్ నేలపై పడిపోయి నొప్పితో తీవ్రంగా బాధపడ్డాడు. పక్కటెముకల దగ్గర తీవ్రమైన అసౌకర్యంతో చేతిని అక్కడే పెట్టుకున్నారు. వెంటనే సహచర ఆటగాళ్లు, ఫిజియో వచ్చి సహాయం అందించారు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత ఆయన మైదానం విడిచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. 

35
టీమిండియా ఆందోళన

ఈ కీలక మూడో మ్యాచ్‌లో శ్రేయస్ గాయం భారత జట్టుకు పెద్ద ఆందోళనగా మారింది. ఆయన బ్యాటింగ్ చేయగలరా అనే ప్రశ్నలు వస్తున్నాయి. తిరిగి ఫీల్డ్‌లోకి రాలేదు.

అంతకు ముందు కూడా అయ్యర్ భుజ గాయం (2021), వెన్నునొప్పి కారణంగా క్రికెట్‌కు దూరమైన అనుభవం ఉంది. అందుకే ఈ తాజా గాయం మరింత ఆందోళన కలిగిస్తోంది.

45
ఆస్ట్రేలియా ఆలౌట్

ఈ ఘటన జరిగే సమయానికి ఆస్ట్రేలియా 37 ఓవర్లకు 5 వికెట్లకు 196 పరుగులు చేసింది. మొత్తంగా ఆసీస్ ఈ మ్యాచ్ లో 236 పరుగులకు ఆలౌట్ అయింది. హర్షిత్ రాణా 4 వికెట్లు తీసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ కు 2 వికెట్లు పడ్డాయి. భారత్ ముందు ఆసీస్ 237 పరుగుల టార్గెట్ ను ఉంచింది.

55
వైట్‌వాష్ ను తప్పించుకోవడం భారత్ లక్ష్యం

ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చిన తర్వాత ఆస్ట్రేలియాకు భారత బౌలర్లు చెక్ పెట్టారు. దీంతో ఆస్ట్రేలియా పూర్తి ఓవర్లు ఆడకుండానే ఇన్నింగ్స్ ను ముగించింది. ఇప్పుడు భారత్ గెలుపే లక్ష్యంగా తమ ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది. కానీ శ్రేయస్ గాయం జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. వైట్ వాష్ కాకుండా ఉండాలంటే భారత్ ఈ మ్యాచ్ ను తప్పకుండా గెలవాలి.

ఈ సిరీస్ అనంతరం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభం కాబోతోంది. కాబట్టి అయ్యర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories