వర్త్ వర్మ వర్త్..! ఐపీఎల్‌లో తోపు ట్రేడ్ ఇదే.. ఢిల్లీ దెబ్బ అదుర్స్ కదూ..

Published : Nov 02, 2025, 07:26 PM IST

IPL: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారే అవకాశాలున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ట్రేడ్ కి రెండు ఫ్రాంచైజీలు దాదాపు అంగీకరించినట్లు సమాచారం. 

PREV
15
కీలక డీల్ పై నెట్టింట చర్చ..

ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి ఒక కీలక ట్రేడ్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ హల్చల్ చేస్తోంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఆ జట్టుకు వీడ్కోలు పలికి ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారే అవకాశాలున్నట్లు పలు వార్తలు చెబుతున్నాయి. ఈ ట్రేడ్ దాదాపు ఖాయమైనట్లు సమాచారం.

25
సంజూ శాంసన్ డీల్..

సంజు శాంసన్‌ను తమ జట్టులోకి తీసుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్ ఆసక్తిని చూపిస్తోంది. అయితే తమ ప్రధాన ఆటగాళ్లను రాజస్థాన్‌కు బదిలీ చేసేందుకు ఢిల్లీ సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ తన రూ. 10 కోట్ల ప్లేయర్ ట్రిస్టాన్ స్టబ్స్‌ను రాజస్థాన్‌కు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, రాజస్థాన్ రాయల్స్ స్టబ్స్‌తో పాటు దక్షిణాఫ్రికాకు చెందిన మరొక అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను కూడా తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ జట్టు ఈ డిమాండ్‌ను ఇంకా పరిగణనలోకి తీసుకోలేదు. ఈ మొత్తం వ్యవహారంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

35
ఢిల్లీ మాజీ ప్లేయర్..

సంజూ శాంసన్ ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ ఫ్రాంచైజీ తరఫున గతంలో కూడా ఆడాడు. 2016, 2017 ఐపీఎల్ సీజన్లలో అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున బరిలోకి దిగాడు. 2016 ఐపీఎల్ సీజన్‌లో, సంజూ 14 మ్యాచ్‌లలో 291 పరుగులు సాధించాడు. ఆ తర్వాత 2017 ఐపీఎల్ సీజన్‌లో, అతను 14 మ్యాచ్‌లలో 386 పరుగులు చేసి, అందులో ఒక సెంచరీ కూడా నమోదు చేశాడు. 2018 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు సంజూ శాంసన్‌ను కొనుగోలు చేసింది. అప్పటి నుంచి సంజు రాయల్స్‌లో కీలకంగా మారాడు.

45
ఢిల్లీ క్యాపిటల్స్ దద్దరిల్లే డీల్

ఇటీవల నివేదికల ప్రకారం, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సంజూను ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇచ్చి, ఆ జట్టు నుంచి కేఎల్ రాహుల్‌ను తమ జట్టులోకి తీసుకోవాలని అనుకుంది. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ప్రతిపాదనను అంగీకరించడానికి అస్సలు ఇష్టపడలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ జట్టు బ్రాండ్ విలువను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాడని నమ్మకం ఉంచింది. అంతేకాకుండా, గత సీజన్‌లో కూడా రాహుల్ అసాధారణమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ కారణాల వల్ల ఢిల్లీ రాహుల్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేదు.

55
తుది దశకు చేరుకునే అవకాశం..

ప్రస్తుతానికి, సంజూ శాంసన్ ట్రేడ్ కి సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నట్లు అనిపిస్తోంది. రాజస్థాన్, స్టబ్స్‌తో పాటు అదనపు ఆటగాడిని డిమాండ్ చేయడం ఈ ప్రక్రియలో ఒక కీలక మలుపు. రెండు ఫ్రాంచైజీల మధ్య తుది ఒప్పందం కుదిరి, అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories