IPL నుండి రోహిత్ శర్మ ఔట్...? ఆ గాయం అంత సీరియసా..?

Published : Apr 13, 2026, 06:27 PM IST

ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఐపిఎల్ 2026 టోర్నీ మొత్తానికి దూరం కానున్నాడా లేక తర్వాత పంజాబ్ తో జరిగే మ్యాచ్ మాత్రమే ఆడటంలేదా..? ఆర్సిబితో జరిగిన మ్యాచ్ లో అతడికైన గాయం ఎంత సీరియస్..?

PREV
16
రోహిత్ శర్మకు ఏమయ్యింది..?

Rohit Sharma : టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్ కు దూరమైనట్లేనా..? ఇదే అనుమానం ఇప్పుడు అభిమానుల్లో మొదలయ్యింది. నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ గాయపడ్డాడు... అయితే గాయం చాలా తీవ్రమైనదిగా తెలుస్తోంది. దీంతో తర్వాత పంజాబ్ తో జరిగే మ్యాచ్ కు కూడా రోహిత్ దూరం కానున్నట్లు తెలుస్తుంది. పూర్తిస్థాయి వైద్యపరీక్షల అనంతరం రోహిత్ కేవలం ఈ ఒక్క మ్యాచ్ కు దూరమవుతాడా లేక ఐపిఎల్ టోర్నీ మొత్తానకి దూరం అవుతాడా అన్నది తేలనున్నది.

26
రోహిత్ శర్మకు ఏమయ్యింది..?

నిన్న (ఆదివారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ ఓపెనర్ గా బరిలోకి దిగాడు. 241 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు... ఈ క్రమంలో అతడు 13 బంతుల్లో 19 పరుగులు చేశాడు. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా తొడ కండరాల్లో నొప్పి కారణంగా విలవిల్లాడిపోయిన రోహిత్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు.

ఆర్సిబి బౌలర్ కృనాల్ పాండ్యా వేసిన ఐదో ఓవర్ ముగిశాక, రోహిత్ కాలి కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఫిజియోను పిలిపించి మైదానంలోనే చికిత్స తీసుకున్నాడు. కానీ నొప్పి తగ్గకపోవడంతో ఆ తర్వాతి ఓవర్‌లో అతను మైదానం విడిచి వెళ్ళిపోయాడు.. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడినా రోహిత్ మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో ఆయన గాయం తీవ్రమైనదేనని తెలుస్తోంది.

36
రోహిత్ గాయంపై ఏఐ ప్లేయర్ క్లారిటీ...

రోహిత్ శర్మ గాయంపై ఎంఐ ప్లేయర్ రూథర్ చేసిన కామెంట్స్ కాస్త ఆందోళనకరంగానే ఉన్నాయి. రోహిత్ తొడ కండరాలు పట్టేశాయని మైదానం వీడారు... ప్రస్తుతం అతడు వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నాడని తెలిపాడు. రోహిత్ పిట్ నెస్ గురించి అభిమానుల్లోనే కాదు జట్టు సభ్యుల్లోనూ ఆందోళన ఉందనేలా రూథర్ ఫర్డ్ కామెంట్స్ ఉన్నాయి.

46
రోహిత్ కు వైద్య పరీక్షలు...

రోహిత్ శర్మ గాయం ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు... త్వరలోనే ఈ రిపోర్టులు రానున్నాయి. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే తర్వాతి మ్యాచ్ కాదు ఇక్క ఐపిఎల్ నుండే ఔట్ అయ్యే అవకాశాలున్నాయి. ముంబై ఇండియన్స్ అభిమానులే కాదు యావత్ క్రికెట్ ప్రియులు ఇలా జరగొద్దని... రోహిత్ ఐపిఎల్ ఆడాలని కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

56
గాయపడ్డా రోహిత్ శర్మ రికార్డుల మోత ఆగట్లేదు..

స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ రికార్డుల పుస్తకాల్లో తన పేరు లిఖించుకున్నాడు. గాయంతో బాధపడుతూనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 6000 పరుగులు పూర్తిచేశాడు... ఈ మైలురాయికి చేరుకున్న తొలి ముంబై ఆటగాడిగా నిలిచాడు. ముంబైలో ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో 'హిట్‌మ్యాన్' ఈ ఘనతను సాధించాడు. ముంబై ఫ్రాంచైజీ తరఫున రోహిత్ ఇప్పటివరకు 231 మ్యాచ్‌లలో 29.76 సగటు, 132.82 స్ట్రైక్ రేట్‌తో 6013 పరుగులు చేశాడు. ఇందులో 40 అర్ధ సెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి.

ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో రోహిత్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (3809) ఉన్నాడు. ఇక ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రోహిత్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అతను 276 మ్యాచ్‌లలో 7183 పరుగులు చేశాడు. ఈ జాబితాలో RCB బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లీ 271 మ్యాచ్‌లలో 8840 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

66
కోహ్లీకి కూడా గాయం

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కూడా గాయపడ్డాడు. RCB ఇన్నింగ్స్ పదో ఓవర్‌లోని ఐదో బంతి తర్వాత కోహ్లీ తన ఎడమ కాలికి చికిత్స తీసుకుంటూ కనిపించాడు. ఆ తర్వాత అతను డగౌట్‌కే పరిమితమయ్యాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 38 బంతుల్లో 50 పరుగులు చేసి, MI కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో 15వ ఓవర్‌లో ఔటయ్యాడు.

Read more Photos on
click me!

Recommended Stories