రూ. 16,000 కోట్లకు అమ్ముడుపోతున్న బెంగళూరు టీమ్!
ఆర్సీబీ ఫ్రాంచైజీ విలువ సుమారు 2 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 16,600 కోట్లకు పైగా) ఉంటుందని అంచనా. 2021లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టును రూ. 7,000 కోట్లకు కొనుగోలు చేయగా, ఇప్పుడు ఆర్సీబీ ధర అంతకు రెట్టింపు కంటే ఎక్కువగా ఉండటం ఐపీఎల్ బ్రాండ్ విలువను చాటిచెబుతోంది. అయితే, భవిష్యత్తులో మీడియా హక్కుల ధరలపై ఉన్న అనిశ్చితి వల్ల కొంతమంది బిడ్డర్లు వెనకడుగు వేస్తున్నా, ఆర్సీబీకున్న ఫ్యాన్ బేస్ వల్ల భారీ ధర ఖాయమని తెలుస్తోంది.
ఆర్సీబీ కోనుగోలు రేసులో ఇద్దరు ప్రధాన బిడ్డర్లు
ప్రస్తుతం ఆర్సీబీని దక్కించుకోవడానికి ఇద్దరు ప్రధాన పోటీదారులు మిగిలారు.
1. రంజన్ పాయ్ కన్సార్టియం: మణిపాల్ హాస్పిటల్స్ అధినేత రంజన్ పాయ్, అమెరికాకు చెందిన కోల్‌బర్గ్ క్రావిస్ రాబర్ట్స్, సింగపూర్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ టెమాసెక్ తో కలిసి బిడ్ దాఖలు చేశారు.
2. ఈక్యూటీ (EQT): స్వీడన్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఈక్యూటీ ఒంటరిగా లేదా స్థానిక భారతీయ సంస్థతో కలిసి జట్టును కొనుగోలు చేసే ఆలోచనలో ఉంది.