జట్టులో అనుభవం లేని ఆటగాళ్లపై భారీగా పెట్టుబడి పెట్టడం ఒక రిస్క్ అని చెప్పాలి. ముఖ్యంగా ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మల కోసం ఫ్రాంచైజీ 14.2 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. వీరిద్దరూ భవిష్యత్ స్టార్లుగా పేరు తెచ్చుకున్నా, ఐపీఎల్ వంటి హై-ప్రెజర్ టోర్నీలో విఫలమైతే జట్టు ఆశలు దెబ్బతింటాయి. సీజన్ ఆరంభంలోనే వరుస ఓటములు ఎదురైతే, యువ ఆటగాళ్లు మానసిక ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది.
ఐపీఎల్ 2026 కోసం చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి స్క్వాడ్ ఇదే
మహేంద్ర సింగ్ ధోనీ, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజూ శాంసన్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ఉర్విల్ పటేల్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, శ్రేయస్ గోపాల్, ఖలీల్ అహ్మద్, రామకృష్ణ ఘోష్, ముఖేష్ చౌదరి, జేమీ ఓవర్టన్, గుర్జప్‌నీత్ సింగ్, అన్షుల్ కంబోజ్, అఖీల్ హుస్సేన్, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ, మాథ్యూ షార్ట్, అమన్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, మాట్ హెన్రీ, రాహుల్ చాహర్, జాక్ ఫోల్క్స్.