RCB vs SRH : ఇది కదా అసలైన విధ్వంసం.. 202 రన్స్ టార్గెట్‌ను 15 ఓవర్లలోనే ఉఫ్ అని ఊదేశారు !

Published : Mar 28, 2026, 11:30 PM IST

RCB vs SRH : ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 202 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించింది.

PREV
16
ఆర్సీబీ ఊచకోత.. హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించిన కోహ్లీ, పడిక్కల్!

ఐపీఎల్ 2026 సీజన్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విక్టరీతో ప్రారంభించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ పరుగుల విధ్వంసం సృష్టించింది. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ తమ బ్యాటింగ్‌తో స్టేడియాన్ని హోరెత్తించారు.

26
ఆరంభం నుంచే ఆర్సీబీ దూకుడు.. పడిక్కల్ పరుగుల సునామీ

లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే ఫిలిప్ సాల్ట్ (8) రూపంలో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన దేవదత్ పడిక్కల్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. పడిక్కల్ కేవలం 26 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసి హైదరాబాద్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ముఖ్యంగా డేవిడ్ పేన్ వేసిన 4వ ఓవర్లో 18 పరుగులు రాబట్టి ఆర్సీబీ ఇన్నింగ్స్‌కు ఊపునిచ్చాడు. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పడిక్కల్, విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

36
విరాట్ కోహ్లీ కింగ్ క్లాస్ నాక్.. రికార్డుల వేట మొదలు

మరోవైపు విరాట్ కోహ్లీ తనదైన శైలిలో క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. 38 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచి విన్నింగ్ పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్‌గా షోయబ్ మాలిక్ రికార్డును కోహ్లీ అధిగమించాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలో ఛేజింగ్‌లో 4000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. హర్షల్ పటేల్ వేసిన 15.4 ఓవర్లో ఫోర్ కొట్టి కోహ్లీ మ్యాచ్‌ను ముగించాడు.

46
పాటిదార్ విధ్వంసం.. టిమ్ డేవిడ్ మెరుపులు

మధ్యలో వచ్చిన రజత్ పాటిదార్ కేవలం 12 బంతుల్లోనే 31 పరుగులు (2 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇషాన్ మలింగ వేసిన ఓవర్లో వరుస సిక్సర్లతో పాటిదార్ స్టేడియాన్ని హోరెత్తించాడు. చివర్లో టిమ్ డేవిడ్ 10 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 16 పరుగులు చేసి కోహ్లీకి అవసరమైన సహకారం అందించాడు. హైదరాబాద్ బౌలర్లలో డేవిడ్ పేన్ 2 వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

56
హైదరాబాద్ ఇన్నింగ్స్.. కిషన్ పోరాటం వృథా

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ ఒంటరి పోరాటం చేస్తూ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో అనికేత్ వర్మ (18 బంతుల్లో 43) మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్ 200 పరుగుల మార్కును దాటగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో జాకబ్ డఫీ తన అరంగేట్రం మ్యాచ్‌లోనే హైదరాబాద్ టాపార్డర్‌ను దెబ్బతీశాడు.

66
డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాకు తగ్గ ఆట

గత సీజన్ విజేతలుగా బరిలోకి దిగిన ఆర్సీబీ, మొదటి మ్యాచ్‌లోనే తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. 202 పరుగుల లక్ష్యాన్ని మరో 26 బంతులు మిగిలి ఉండగానే ఛేదించడం ఆర్సీబీ బ్యాటింగ్ బలాన్ని నిరూపిస్తోంది. ప్యాట్ కమిన్స్ లేకపోవడం హైదరాబాద్ బౌలింగ్ విభాగాన్ని బలహీనపరిచింది. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో శుభారంభం చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories