ఐపిఎల్ లో అదరగొడుతున్న రజత్ పాటిదార్ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. అతడి ఆట గురించి అందరికీ తెలుసు... మరి ఆస్తిపాస్తుల గురించి తెలుసా..? పాటిదార్ లైఫ్‌స్టైల్, కార్ కలెక్షన్, సంపాదన.. ఇలా అతని జీవితానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
Rajat Patidar : భారత క్రికెట్‌లో నిలకడగా ఎదుగుతున్న టాలెంటెడ్ ఆటగాడు రజత్ పాటిదార్. ముఖ్యంగా ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కీలక ఆటగాడిగా మారాడు. కెప్టెన్ గానే కాదు బ్యాటర్ గా కూడా అదరగొడుతున్నాడు... ప్రస్తుతం 222 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. దేశవాళీ క్రికెట్ నుంచి మొదలైన అతని కెరీర్ ఇప్పుడు సంపాదన, లైఫ్‌స్టైల్‌ను కూడా మార్చేసింది.
25
పాటిదార్ ఆస్తి ఎంతో తెలుసా..?
రజత్ పాటిదార్ నికర ఆస్తి విలువ సుమారు రూ.15-20 కోట్లు ఉంటుందని అంచనా. అతని ఆదాయంలో ఎక్కువ భాగం ఐపీఎల్ నుంచే వస్తుంది. కాంట్రాక్టులను బట్టి ఒక్కో సీజన్‌కు రూ.11 కోట్ల వరకు సంపాదిస్తాడని సమాచారం. దీనితో పాటు, దేశవాళీ క్రికెట్ మ్యాచ్ ఫీజులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా ఏటా కొన్ని కోట్లు ఆర్జిస్తున్నాడు.
35
పాటిదార్ ఇంటి విలువ ఎంతో తెలుసా?
పాటిదార్‌కు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక మంచి ఇల్లు ఉంది. అతను పుట్టి పెరిగింది కూడా అక్కడే. అతని ఇంటి విలువ కచ్చితంగా తెలియకపోయినా, సుమారు రూ.2-4 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అతని లైఫ్‌స్టైల్ చూస్తే, విపరీతమైన లగ్జరీ కంటే సౌకర్యవంతమైన, సింపుల్ జీవితాన్ని ఇష్టపడతాడని తెలుస్తుంది.
రజత్ పాటిదార్ కార్ కలెక్షన్ మరీ పెద్దది కాకపోయినా, ప్రీమియంగా ఉంటుంది. అతని వద్ద హ్యుందాయ్ క్రెటా (సుమారు రూ.15-20 లక్షలు), మహీంద్రా థార్ (సుమారు రూ.15 లక్షలు) వంటి కార్లు ఉన్నాయని సమాచారం. అతని కార్ల ఎంపిక చూస్తే, స్టైల్‌తో పాటు ప్రాక్టికాలిటీకి కూడా ప్రాధాన్యం ఇస్తాడని అర్థమవుతుంది.
55
పాటిదార్ సింపుల్ లైఫ్
ఎంత విజయం సాధిస్తున్నా పాటిదార్ చాలా సింపుల్‌గా ఉంటాడు. తన పూర్తి ఫోకస్ క్రికెట్‌పైనే పెడతాడు. ఇదే విధంగా నిలకడగా రాణిస్తే, భవిష్యత్తులో పెద్ద ఐపీఎల్ డీల్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లతో అతని ఆస్తులు, సంపాదన మరింత పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు టీమిండియాలో స్థిరమైన చోటు దక్కించుకునే అవకాశాలు కూడా ఉంటాయి.