Virat Kohli : కోహ్లీ ఇష్టపడ్డ ఈ అమ్మాయి ఎవరు..? అసలు కథేంటి..?

Published : Apr 17, 2026, 04:13 PM IST

విరాట్ కోహ్లీ లైక్ చేశాడంటూ ఓ జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఫోటో ఇండియాలో ట్రెండ్ అవుతోంది. ఈ ఊహించని పరిణామంతో ఆమెపై విపరీతమైన ఆసక్తి, మీమ్స్, చర్చలు మొదలయ్యాయి. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా..?  

PREV
13
ఎవరీ లిజ్ లాజ్..?

లిజ్ లాజ్… ఈమె జర్మనీకి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమె ఎక్కువగా లైఫ్‌స్టైల్ కంటెంట్ క్రియేట్ చేస్తుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ బయో ప్రకారం ఒక వ్లాగర్, ఫుడీ, సింగర్. ఆమె ఫీడ్‌లో ట్రావెల్ క్లిప్స్, సరదాగా పాడిన పాటల వీడియోలతో పాటు జెంజీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసే బోల్డ్, స్టైలిష్ ఫోటోలు ఉంటాయి.

లిజ్ లాజ్ కు ఇన్స్టాగ్రామ్ లో 4 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నా, ఆమె వ్యక్తిగత వివరాలు పెద్దగా అందుబాటులో లేవు. కానీ ఇప్పుడు ఆమె ప్రొఫైల్ ఇండియన్ సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది.

23
ఈ ఫోటోనేనా కోహ్లి ఇష్టపడింది...?

లిజ్ లాజ్ పోస్ట్ చేసిన ఓ బోల్డ్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోను విరాట్ కోహ్లీ లైక్ చేశాడంటూ తెగ ప్రచారం జరుగుతోంది. దీంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది… వెంటనే కొన్ని స్క్రీన్‌షాట్లు వైరల్ అయ్యాయి. ఆన్‌లైన్‌లో రకరకాల ఊహాగానాలు, జోకులు పేలాయి. కోహ్లీ భార్య అనుష్క శర్మను కూడా ఈ వైరల్ ఫోటో వివాదంలో లాగుతున్నారు.

అసలు కోహ్లీ నిజంగా లిజ్ లాజ్ బోల్డ్ ఫోటోకి లైక్ చేశాడా..? పొరపాటున జరిగిందా? లేక ఏదైనా టెక్నికల్ సమస్యా అనేది స్పష్టంగా తెలియకపోయినా, నెటిజన్లు మాత్రం ఆగలేదు. మీమ్స్, జోకులతో సోషల్ మీడియాను నింపేశారు.  

33
కోహ్లీ ఏం చేసినా వైరల్..

ఆసక్తికరంగా కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ యాక్టివిటీ వైరల్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు. 2024లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అప్పుడు అవనీత్ కౌర్ పోస్ట్‌ను కోహ్లీ లైక్ చేశాడని అభిమానులు గమనించారు. ఆ సమయంలో కోహ్లీ స్పందిస్తూ, తన ఫీడ్ క్లియర్ చేస్తున్నప్పుడు అల్గారిథమ్ సమస్య వల్ల అలా జరిగి ఉండొచ్చని చెప్పాడు.

ఈ ఘటనలను బట్టి ఒక్క విషయం అర్థమవుతోంది… కోహ్లీ లాంటి సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఏం చేసినా సంచలనంగా మారడం ఖాయం. చివరకు అనుకోకుండా చేసిన చర్యలు కూడా వైరల్ గా మారుతుంటాయని కోహ్లీ వ్యవహారంలో స్పష్టమవుతోంది. మరి లిజ్ లాజ్ విషయంలో ఏం జరిగిందో..? 

Read more Photos on
click me!

Recommended Stories