Rahul Dravid: ఐపీఎల్, వైట్ బాల్ క్రికెట్ కారణంగా ఆటగాళ్లకు రెడ్ బాల్ ప్రిపరేషన్ సమయం లభించడం లేదని, ఇది సాంకేతిక లోపం కంటే మానసిక, సమయపాలన సవాల్ అని ద్రావిడ్ పేర్కొన్నారు. దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించకపోతే..
టీమిండియా టెస్ట్ క్రికెట్ ప్రస్తుతం సంక్లిష్టమైన దశలో ఉందని మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ అన్నారు. గత దశాబ్దంగా స్వదేశంలో తిరుగులేని శక్తిగా ఉన్న భారత జట్టు ఇటీవల న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో ఎదురైన పరాజయాలతో పట్టు కోల్పోతోందని ఆయన పేర్కొన్నారు.
25
వరుస సిరీస్ ఓటములు..
టీమిండియా ఇటీవల న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురవడం, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలో చవిచూస్తున్న పరాజయాలతో తన పట్టును కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు రాకపోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
35
సాంకేతిక లోపం కంటే..
దీనికి ప్రధాన కారణం ఆటగాళ్లలో సాంకేతిక లోపం కంటే, ఫార్మాట్ల మధ్య మారే క్రమంలో ఎదుర్కొంటున్న మానసిక, సమయపాలన సవాళ్లు అని ద్రావిడ్ వివరించారు.
నేటి క్రికెటర్లు ఐపీఎల్, అంతర్జాతీయ వైట్ బాల్ క్రికెట్‌లో మునిగి తేలుతున్నారని, టెస్ట్ సిరీస్‌కు కేవలం మూడు, నాలుగు రోజుల ముందు చేరుకోవడం వల్ల ఎర్ర బంతితో ఆడే నైపుణ్యాన్ని అలవర్చుకోవడానికి సమయం సరిపోవడం లేదని ఆయన అన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లు ఉన్నప్పటికీ, మిడిల్ ఆర్డర్‌లో స్థిరత్వం లేకపోవడం జట్టును దెబ్బతీస్తోంది.
55
మజిల్ మెమరీని కోల్పోతున్నారని..
మూడు ఫార్మాట్లు ఆడే ఆటగాళ్లు ఆరు నెలల తర్వాత టెస్ట్ మ్యాచ్‌లోకి వచ్చినప్పుడు రెడ్ బాల్ కదలికను అర్థం చేసుకునే మజిల్ మెమరీని కోల్పోతున్నారని ద్రావిడ్ బలంగా చెప్పారు. టెస్ట్ క్రికెట్‌కు అవసరమైన అంకితభావం లేదని.. ఇది నిర్ణయాత్మక లోపంగా ఆయన అభిప్రాయపడ్డారు.