ప్రో కబడ్డి 2019: సొంత గడ్డపై మరో ఓటమి....తెలుగు టైటాన్స్ పై తమిళ తలైవాస్ ఘనవిజయం

First Published Jul 22, 2019, 2:44 PM IST

గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ప్రో కబడ్డి లీగ్ 2019 లో తెలుగు టైటాన్స్ మరో ఓటమిని చవిచూసింది. ఇప్పటికే యూ ముంబా చేతిలో ఓటమిపాలైన టైటాన్స్ తాజాగా తమిళ తలైవాస్ చేతిలో కూడా ఓటమిని చవిచూసింది. 

ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన తెలుగు టైటాన్స్ జట్టు ఆరంభంలోనే చతికిలపడుతోంది. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఆరంభ మ్యాచ్ లో ఆ జట్టు యూ ముంబా చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ లోనూ తెలుగు టైటాన్స్ తమిళ్ తలైవాస్ చేతిలో ఓటమిని చవిచూసింది. ఇలా హోం గ్రౌండ్ లో వరుసగా రెండోసారి పరాజయంపాలై టైటాన్స్ జట్టు తెలుగు ప్రజలను నిరాశకు గురిచేసింది.
undefined
తెలుగు టైటాన్స్ పై తమిళ తలైవాస్ జట్టు మొదటి నుండి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా గత సీజన్లలో తెలుగు టైటాన్స్ తరపున ఆడి ప్రస్తుతం తమిళనాడు జట్టులో చేరిన స్టార్ రైడర్ రాహుల్ చౌదరి ఈ మ్యాచ్ లో అదరగొట్టాడు. అతడు అత్యధికంగా 12 పాయింట్స్( 10 రైడ్, 2 ట్యాకిల్) సాధించి తలైవాస్ జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టాడు. మరో రైడర్ మంజిత్ చిల్లర్ కూడా 5 పాయింట్స్ తో ఆకట్టుకున్నాడు.
undefined
ఇక టైటాన్ జట్టు ఆటగాళ్లలో ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో మొదటి హాఫ్ లో ఏకంగా 20-10 తేడాతో టైటాన్స్ వెనుకబడటంతోనే సగం ఓటమి ఖాయమయ్యింది. ఇక సెకండాఫ్ లో కూడా టైటాన్స్ జట్టు పుంజుకోలేకపోయింది. ముఖ్యంగా స్టార్ రైడర్ సిద్దార్థ్ దేశాయ్ (5 పాయింట్లు) ఈ మ్యాచ్ లోనూ అంచనాలకు తగ్గట్లుగా ఆకట్టుకోలేకపోయాడు.
undefined
ఇలా తమిళ తలైవాస్ సమిష్టి పోరాటం ముందు టైటాన్స్ జట్టు నిలవలేక 13 పాయింట్స్ తేడాతో పరాజయాన్ని చవిచూసింది. తలైవాస్ జట్టు 39 పాయింట్స్ సాధించగా, తెలుగు టైటాన్స్ మాత్రం 26 పాయింట్స్ వద్దే నిలిచిపోయింది. ఇలా టైటాన్స్ సొంత గడ్డపై వరుసగా రెండో ఓటమిని చవిచూసింది.
undefined
ఇక అంతకు ముందు అదే గచ్చిబౌలి వేదికన జరిగిన మొదటి మ్యాచ్ లో గుజరాత్ ఫార్చున్‌ జెయింట్స్‌ విజయాన్ని అందుకుంది. బెంగళూరు బుల్స్ ను అతి సునాయాసంగా అడ్డుకున్న గుజరాత్ ఏకంగా 18 పాయింట్స్ ఆధిక్యంతో విజయాన్ని అందుకుంది. ఫార్చున్‌ జెయింట్స్‌ 42 పాయింట్లు సాధించగా బెంగళూరు కేవలం 24 పాయింట్స్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
undefined
click me!