ప్రో కబడ్డి సీజన్-7: లే పంగా... తెలుగు టైటాన్స్ కు వీరే కొండంత బలం

First Published | Jul 19, 2019, 4:17 PM IST

ప్రో కబడ్డి లీగ్ ఆరంభ మ్యాచ్ కు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదిక కానుంది. ఈ మ్యాచ్ లో యూ ముంబాతో టైటాన్స్ జట్టు తలపడనుంది. ఈ సందర్భంగా టైటాన్స్ జట్టు బలాబలాల  గురించి ఓసారి తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల క్రీడగా పేరొందిన కబడ్డీకి కార్పోరేట్ హంగులు పులిమి మరింత ఆకర్షణీయంగా తయారుచేసిన లీగే ప్రో కబడ్డి. ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ లీగ్ ఏడో సీజన్ కు సిద్దమయ్యింది. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం ఈ సీజన్ 7 ఆరంభ వేడుకలకు వేదిక కానుంది. ఇలా ఈ లీగ్ లో తెలుగు టైటాన్స్, యూ ముంబా మధ్య ఆరంభ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తెలుగు టైటాన్స్ బలాబలాల గురించి ఓసారి పరిశీలిద్దాం.
undefined
తెలుగు టైటాన్స్ జట్టు: రైడర్స్: అమిత్ కుమార్, అంకిత్ బెనివాల్, కమల్ సింగ్, ముల శివ గణేశ్ రెడ్డి, రజనీశ్, రాకేశ్ గౌడ, సిద్దార్థ్ సిరిశ్ దేశాయి, సూరజ్ దేశాయ్. డిఫెండర్స్: ఆకాశ్ దత్తు అర్సుల్, ఆకాశ్ చౌదరి, మనిష్, సి అరుణ్, అబూజర్ మొహజర్ మిగాని, కృష్ణ మదానే, విశాల్ భరద్వాజ్. ఆల్ రౌండర్స్: అర్మాన్, డేవిట్ జెన్నింగ్స్, ఫర్హాద్ రహీమి మిలగర్ధన్
undefined

Latest Videos


వీరిపైనే టైటాన్స్ ఆశలు: సిద్దార్థ్ సిరిశ్ దేశాయి: గత సీజన్ 6 లో యూ ముంబా తరపున అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రైడర్ సిద్దార్థ్ దేశాయ్ తెలుగు టైటాన్స్ తరపున ఆడుతున్నాడు. అతడు ఈ సీజన్లో కూడా రాణిస్తాడన్న నమ్మకాన్ని యాజమాన్య, తెలుగు అభిమానులు కలిగివున్నారు. అభిమానులు ముద్దుగా బాహుబలి అని పిలుచుకునే సిద్దార్థ్ గత సీజన్లో అత్యధిక పాయింట్స్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అతడు 218 రైడ్ పాయింట్స్ తో అగ్రస్థానంలో నిలిచాడు.
undefined
శివ గణేశ్ రెడ్డి: ఇక టైటాన్స్ జట్టులో వున్న ఏకైక తెలుగు ఆటగాడు శివ గణేష్ రెడ్డి. ఇతడిపై కూడా అభిమానులు మంచి నమ్మకంతో వున్నారు. రైడర్ గా ఇతడు సిద్దార్థ్ కు మంచి సహకారాన్ని అందిస్తే టైటాన్స్ జట్టు విజయం సాధించడం అంతక కష్టమైన అంశమేమీ కాదు.
undefined
ఫర్హాద్ మిలగర్దన్: ఇరాన్ కు చెందిన ఈ ఆల్ రౌండర్ కూడా టైటాన్స్ టీం లో బలమైన ఆటగాడు. డిఫెన్స్, రైడింగ్ రెండింటిలోనూ సమర్థుడు ఈ పర్హాద్. ఇతడు విజృంభిస్తే తెలుగు టైటాన్స్ ను అడ్డుకోవడం ఎవరితరం కాదు.
undefined
అబూజర్ మిగానే, విశాల్ భరద్వాజ్: ఈ ఇద్దరు పవర్్ ఫుల్ కార్నర్ ప్లేయర్స్ టైటాన్స్ జట్టులో ఎంతో కీలకంగా మారనున్నారు. గత సీజన్లో వీరిద్దరు సూపర్ ట్యాకిల్స్ సాధించారు. వీరిద్దరు కార్నర్ లో పొంచి వుండగా ప్రత్యర్థి రైడర్స్ పాయింట్స్ తో వెనుదిరగడం చాలా కష్టమైన పని
undefined
మిగతా ఆటగాళ్లు: రైడర్ అమిత్ కుమార్, డిఫెండర్ సి అరుణ్ కూడా అత్యుత్తమ ఆటగాళ్లే. తమదైన రోజున వీరు ఎలాంటి అద్భుతాలైనా చేయగలరు. అలాగే తెలుగు టైటాన్స్ జట్టులోని మరికొంత మంది ఆటగాళ్లు కూడా మంచి ఆటతీరును కనబరిచే అవకాశాలున్నాయి.
undefined
click me!