ధోని సహా.. ఈ దిగ్గజ క్రికెటర్లకు ఇదే ఆఖరి వరల్డ్ కప్

First Published 15, Jun 2019, 1:36 PM

2019 వరల్డ్ కప్ లో కొంత మంది దిగ్గజ ఆటగాళ్లకు ఇదే ఆఖరి వరల్డ్ కప్ కానుంది. ఫామ్ సంగతి పక్కనపెడితే వయసు రీత్యా నాలుగు పదుల వయసు దగ్గరపడుతుండటంతో ఆటగాళ్లు రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. 

341 మ్యాచ్‌ల్లో 10,500కుపైగా పరుగులు చేసిన ధోనికి ఇదే వరల్డ్ కప్ ఆఖరిదని చెప్పవచ్చు. 37 ఏళ్ల ధోని 2004 నుంచి టీమిండియాలో కొనసాగుతున్నాడు. 2007లో టి20 వరల్డ్ కప్ - 2011లో వన్డే వరల్డ్ కప్ ని అందించి చరిత్ర సృష్టించాడు. 2014 టెస్ట్ క్రికెట్ కు ధోని రిటైర్మెంట్‌ ప్రకటించాడు. వరల్డ్ కప్ అనంతరం రిటైర్మెంట్‌ గురించి ధోని వివరణ ఇవ్వనున్నాడు.
క్రిస్ గేల్: ఈ వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడికి సైతం ఇదే చివరి వరల్డ్ కప్. 39 ఏళ్ల గేల్ 1999లో వన్డేల్లోకి అడుగు పెట్టాడు. 10వేలకు పైగా పరుగులు చేసిన గేల్ కూడా 2014లో టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్‌ ఇచ్చాడు.
న్యూజిలాండ్ లో అత్యంత సీనియర్ ప్లేయర్ అయిన రాస్ టేలర్ కి ఇది నాలుగో వరల్డ్ కప్. 35 ఏళ్ల ఈ క్రికెటర్ 221 మ్యాచ్ లు ఆడి కివీస్ జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. నెక్స్ట్ వరల్డ్ కప్ కి టేలర్ ఉండడం డౌటే..
హషిమ్ ఆమ్లా: 36 ఏళ్ల ఈ తెలివైన ప్లేయర్ దక్షిణాఫ్రికా బెస్ట్ ఓపెనర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. 175వన్డేల్లో 8 వేలకు పైగా పరుగులు చేశాడు. ఇదే ఆఖరి వరల్డ్ కప్ కావడంతో జట్టుకు చిరకాల విజయాన్ని అందించి రిటైర్మెంట్‌ తీసుకోవాలని ఆశపడుతున్నాడు.
శ్రీలంకలో ప్రస్తుతం ఉన్న అత్యంత సీనియర్ అండ్ కీ ప్లేయర్ లజిత్ మలింగా. 2010 టెస్ట్ ఫార్మాట్ కి రిటైర్మెంట్‌ ప్రకటించిన ఈ యార్కర్ స్పెషలిస్ట్ వరల్డ్ కప్ అనంతరం వన్డేలకు సైతం రిటైర్మెంట్‌ ప్రకటించవచ్చు.
37 ఏళ్ల షోయబ్ మాలిక్ 1999 నుంచి పాకిస్థాన్ జట్టులో కొనసాగుతున్నాడు. మిడిలార్డర్ స్పెషలిస్ట్ గా గుర్తింపు పొందిన మాలిక్ 285 మ్యాచ్ లు ఆడి 7 వేలకు పైగా పరుగులపు చేశాడు. మాలిక్ కి ఇదే ఆఖరి వరల్డ్ కప్.
బాంగ్లాదేశ్ సీనియర్ ప్లేయర్ మష్రాఫీ మోర్తజాకు కూడా ఇదే ఆఖరి వరల్డ్ కప్ కావచ్చు. 35 ఏళ్ల ఈ ఆల్ రౌండర్ బంగ్లా జట్టుకు కెప్టెన్ గా ఉంటూ మంచి విజయాల్ని అందించాడు. ఈ వరల్డ్ కప్ తో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బాయ్ చెప్పే అవకాశం ఉంది.