Olympics , Daniel Carroll, Kakhi Kakhiashvili
Olympics : మొత్తం 5,084 పతకాల కోసం 208 దేశాల నుంచి 10,714 మంది అథ్లెట్లు, క్రీడాకారులు పోటీ పడనున్నారు. ప్రతి అథ్లెట్ తమ దేశం కోసం పతకం సాధించాలని కలలు కంటారు. కానీ, ఒలింపిక్ హిస్టరీలో ఒకటి కాందు రెండు దేశాలకు బంగారు పతకాలు అందించిన అథ్లెట్లు కూడా ఉన్నారు.
Olympics, Kakhi Kakhiashvili
ఆస్ట్రేలియా-యూఎస్ఏకు గోల్డ్ మెడల్ అందించిన డేనియల్ బ్రెండన్ కారోల్
ఒలింపిక్స్‌లో రెండు దేశాలకు బంగారు పతకాలు సాధించిన తొలి అథ్లెట్ డేనియల్ బ్రెండన్ కారోల్. 1908 లండన్ ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా రగ్బీ జట్టు గోల్డ్ మెడల్ సాధించింది. కారోల్ ఆ జట్టులో భాగంగా ఉన్నాడు. ఆ తర్వాత కారోల్ అమెరికా వెళ్లాడు. బెల్జియంలోని ఆంట్వెర్ప్‌లో జరిగిన 1920 ఒలింపిక్స్‌లో అమెరికన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన జట్టును ఛాంపియన్ గా నిలబెట్టాడు. రగ్బీలో గోల్డ్ మెడల్ ను సాధించాడు. ఇలా రెండు దేశాలకు గోల్డ్ మెడల్ అందించిన క్రీడాకారుడిగా కారోల్ నిలిచాడు.
కాఖీ కఖియాష్విలి : జార్జియా-గ్రీస్
పురుషుల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో జార్జియాలో జన్మించిన కాఖీ కఖియాష్విలి చరిత్ర సృష్టించారు. ఒలింపిక్ క్రీడల్లో వరుసగా 3 బంగారు పతకాలు సాధించిన ప్రపంచంలోని 5 మంది వెయిట్ లిఫ్టర్లలో ఒకరిగా రికార్డు సృష్టించారు. అలాగే, రెండు దేశాలకు ఒలింపిక్ గోల్డ్ మెడల్ అందించిన అథ్లెట్ గా నిలిచాడు. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో అండర్-90 కేజీల విభాగంలో కాఖీ కఖియాష్విలి తన మొదటి బంగారు పతకాన్ని జార్జియా తరఫున బరిలోకి దిగి గెలుచుకున్నాడు. ఆ తర్వాత గ్రీక్ పౌరసత్వాన్ని పొందాడు. 1996 అట్లాంటా, 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో వరుసగా అండర్-99, అండర్-94 కేజీల బరువు విభాగాలలో బంగారు పతకాలను గెలుచుకున్నాడు.