Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రౌండ్ 32 మ్యాచ్‌లో సింగపూర్‌కు చెందిన జియాన్ జెంగ్‌పై 4-2 తేడాతో గెలిచి ఒలింపిక్స్ ప్రీ-క్వార్టర్‌ఫైనల్‌లోకి ప్రవేశించిన రెండో భారతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా ఆకుల శ్రీజ చరిత్ర సృష్టించారు.
Sreeja akula
తన పుట్టిన రోజున అద్భుత ప్రదర్శనతో భారత్ కు మరో మెడల్ అందించే దిశగా పారిస్ ఒలింపిక్స్ లో ముందడుగు వేసింది. ఒలింపిక్స్‌లో 16వ రౌండ్‌కు చేరిన తొలి భారతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా మణికా బత్రా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ఆకుల శ్రీజ కూడా ఒలింపిక్స్ లో 16వ రౌండ్ కు చేరుకుని సంచనలం రేపింది.
బుధవారం సింగపూర్‌కు చెందిన జియాన్ జెంగ్ తో హోరాహోరీగా తలపడిన శ్రీజ 4-2తో మ్యాచ్ ను గెలుచుకుంది. మొదటి నుంచి ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో శ్రీజ అద్భుత ఆటతీరును ప్రదర్శించింది.
ఆరంభంలో తొలి సెట్‌లో వెనకడినా ఆ తర్వాత పుంజుకొని ప్రత్యర్థికి వరుసగా షాకిచ్చింది. శ్రీజ 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10 తో విజయాన్ని అందుకుంది.
Akula Sreeja
51 నిమిషాల పాటు సాగిన ఈ పోటీలో శ్రీజ ఓపెనింగ్ గేమ్‌లో ఓడినా, గట్టిపోటీనిచ్చి విజేతగా నిలిచింది. ప్రీక్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి సన్ యింగ్షాతో శ్రీజ తలపడనుంది.