ఇప్పటివరకు ఒలింపిక్ మెడ‌ల్ గెలిచిన భారత షూటర్లు వీరే..

First Published | Jul 30, 2024, 10:18 PM IST

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త స్టార్ షూట‌ర్ మ‌ను భాక‌ర్ చ‌రిత్ర సృష్టించారు. ఒకే ఒలింపిక్స్ లో రెండు మెడ‌ల్స్ సాధించిన తొలి భార‌త అథ్లెట్ గా స‌రికొత్త రికార్డు సృష్టించారు. 
 

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ 2024 లో భార‌త్ రెండో మెడ‌ల్ కూడా షూటింగ్ లోనే ల‌భించింది. మంగళవారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో మను భాకర్ , సరబ్జోత్ సింగ్ జోడీ కాంస్యం సాధించారు. అంత‌కుముందు మ‌ను భాక‌ర్ సింగిల్స్ లోనూ కాంస్యం గెలుచుకున్నారు. ఇక భార‌త ఒలింపిక్స్ చ‌రిత్ర‌లో భార‌త్ త‌ర‌ఫున షూటింగ్ లో మెడ‌ల్స్ గెలిచిన వారి వివ‌రాలు ఇలా ఉన్నాయి.. 

షూటింగ్‌లో ఒలింపిక్ మెడ‌ల్ విజేతలు-భారత్

1. రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్

సిల్వర్ మెడల్: ఏథెన్స్ (2004)

ఆర్మీ మ్యాన్, క్రీడా మంత్రి, పార్లమెంటు సభ్యుడైన రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ 2004 ఏథెన్స్‌లో పురుషుల డబుల్ ట్రాప్ షూటింగ్ లో వ్యక్తిగత రజతం గెలుచుకున్నాడు.
 

Latest Videos


Abhinav Bindra

2. అభినవ్ బింద్రా

బంగారు పతకం, బీజింగ్ ఒలింపిక్స్ (2008)

ఒలింపిక్స్‌లో భారత తొలి వ్యక్తిగత స్వర్ణ పతక విజేతగా అభినవ్ బింద్రా క్రీడా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాడు.
 

3. గగన్ నారంగ్

కాంస్య పతకం: లండన్ ఒలింపిక్స్ (2012)

హైదరాబాద్ కు చెందిన ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు గగన్ నారంగ్ లండన్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలిచాడు. 
 

4. విజయ్ కుమార్

రజత పతకం: లండన్ ఒలింపిక్స్ (2012)

ఒలింపిక్స్ లో షూటింగ్ లో భారత్ కు మెడల్ గెలిచిన నాలుగో షూటర్ విజయ్ కుమార్. 

5. మను భాకర్

రెండు కాంస్య ప‌త‌కాలు :  పారిస్ ఒలింపిక్స్ 2024

పారిస్ ఒలింపిక్స్ 2024 లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్, సింగిల్ ఈవెంట్‌లో మను భాకర్ రెండు కాంస్య పతకాలు సాధించారు. ఒకే ఒకే ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలిచిన ఏకైక అథ్లెట్. 

Paris Olympics 2024 - Manu Bhaker Sarabjot Singh

6. సరబ్‌జ్యోత్‌ సింగ్

కాంస్య ప‌త‌కం :  పారిస్ ఒలింపిక్స్ 2024 

పారిస్ ఒలింపిక్స్ 2024 లో భార‌త్ రెండో మెడ‌ల్ కూడా షూటింగ్ లోనే ల‌భించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో మను భాకర్ , సరబ్జోత్ సింగ్ జోడీ కాంస్యం సాధించారు. 

click me!