ఒలింపిక్ చరిత్రలో టాప్-5 అన్ బ్రేకబుల్ రికార్డులు ఇవే..

First Published | Jul 24, 2024, 11:48 PM IST

top-5 Unbreakable Olympic Records : ఒలింపిక్ గేమ్స్ ప్రారంభ‌మై చాలా సంత్స‌రాలు అవుతున్న కొన్ని రికార్డులు మాత్రం ఇప్ప‌టికీ బ్రేక్ కావడం లేదు. కొన్ని రికార్డులు కొన్నేళ్లుగా అలాగే ఉన్నాయి. మరికొన్ని దశాబ్దాలుగా అన్ బ్రేకబుల్ రికార్డులుగా ఉన్నాయి. 

top-5 Unbreakable Olympic Records : కొన్ని ఒలింపిక్ రికార్డ్‌లు చాలా నమ్మశక్యం కాని విధంగా న‌మోద‌య్యాయి. అవి ఇప్ప‌టికీ బ్రేక్ కాలేదు. గ‌ణిత లెక్క‌ల ప్ర‌కారం ఆ ఒలింపిక్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్ట‌డం అసాధ‌ర‌ణమైన విష‌యం అని చెప్పాలి. అలాంటి టాప్-5 అన్ బ్రేక‌బుల్ రికార్డులు గ‌మ‌నిస్తే.. 
 

canada

10 ఒలింపిక్ క్రీడ‌ల్లో పోటీ.. 

ఇయాన్ మిల్లర్ 10 ఒలింపిక్ క్రీడ‌ల్లో పాల్గొన్నాడు. కెనడా ఈక్వెస్ట్రియన్ టీమ్ కెప్టెన్, ఇయాన్ మిల్లర్ 1972 నుండి 2012 వరకు ఒలింపిక్ క్రీడ‌ల్లో పోటీ ప‌డ్డాడు. అయితే, ఈ టీమ్ ఒక్క‌సారి కూడా జంపింగ్ ఈవెంట్‌లో స్వర్ణం గెలవలేదు కానీ, రజతం గెలుచుకుంది. 

Latest Videos


Table Tennis

37 టేబుల్ టెన్నిస్ స్వర్ణాల్లో ఒక్క‌ చైనాకే 32 మెడ‌ల్స్

37 టేబుల్ టెన్నిస్ స్వర్ణాల్లో చైనా 32 స్వర్ణాలు గెలుచుకుంది. ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్‌ను చేర్చినప్పటి నుండి చైనా 100 పతకాలలో 53 పతకాలను గెలుచుకుంది. అత్యధిక బంగారు పతకాలు సాధించిన రెండవ దేశం దక్షిణ కొరియా.

ఉసేన్ బోల్ట్ 9.58 సెకన్ల 100 మీటర్ల పరుగు

ఉసేన్ బోల్ట్ 9.58 సెకన్ల 100 మీటర్ల పరుగు అన్  బ్రేక‌బుల్ రికార్డు అని చెప్పాలి. జమైకన్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ 2008లో రికార్డును బద్దలు కొట్టాడు, సెకనులో పదో వంతు కంటే ఎక్కువ తేడాతో అది అసాధ్యమైన ప్రమాణంగా కనిపించింది. 9.69 సెకన్లలో టైసన్ గే ద‌గ్గ‌ర‌గా వ‌చ్చాడు కానీ, బోల్ట్ రికార్డును బ‌ద్ద‌లు కొట్ట‌లేక‌పోయాడు. 

మైఖేల్ ఫెల్ప్స్ 23 గోల్డ్ మెడ‌ల్స్.. మొత్తంగా 28 బంగారు ప‌త‌కాలు

మైఖేల్ ఫెల్ప్స్ 23 ఒలింపిక్ బంగారు పతకాలు సహా మొత్తం 28 మెడ‌ల్స్ గెలుచుకున్నాడు. ఒలింపిక్ చరిత్రలో గొప్ప అథ్లెట్ గా రికార్డు సృష్టించాడు. ఈ అమెరిక‌న్ స్విమ్మ‌ర్ ఒలింపిల్స్ అత్య‌ధిక మెడ‌ల్స్ సాధించిన అథ్లెట్ గా ఉన్నాడు. అందరికంటే ఎక్కువ బంగారు పతకాలను గెలుచున్న‌ది కూడా ఇత‌నే. 20కి పైగా ఒలింపిక్ గోల్డ్ మెడ‌ల్స్ గెలుచుకున్న ఒకేఒక్క‌డు. 

1904 ఒలింపిక్స్‌లో 239 పతకాలు గెలిచిన అమెరికా 

1904 ఒలింపిక్స్‌లో అమెరికా ఏకంగా 239 పతకాలు సాధించింది. 1896లో ఆధునిక ఒలింపిక్ క్రీడలు ప్రారంభమైనప్పటి నుండి యూఎస్ సెయింట్ లూయిస్‌లో సాధించిన ఈ ప‌త‌కాల సంఖ్య‌ను ఏ దేశం కూడా అందుకోలేక‌పోయింది. 

click me!