Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024 జూలై 26న ప్రారంభమవుతుంది. ఈ విశ్వక్రీడలు ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. ఈసారి ఒలింపిక్స్‌కు 117 మంది సభ్యులతో కూడిన భారత బృందం పారిస్‌కు చేరుకుంది. గతంలో కంటే ఎక్కువగా పతకాలు సాధిస్తారని భారత్ ఆశిస్తోంది.
అయితే, సాధారణంగా క్రీడల్లో విజయం సాధించి మెడల్ అందుకున్న తర్వాత అథ్లెట్లు చేసే కొంచెం భిన్నమైన విషయం గురించి చెప్పుకోవాలంటే.. అథ్లెట్లు మెడల్ ను కొరకడం. ఒలింపిక్స్ అయినా, కామన్వెల్త్ అయినా, ఆసియా క్రీడలైనా... పోడియంపై నిలబడి పతకాలను పంటితో కొరికే చిత్రాలను అభిమానులు తరచూ చూస్తూనే ఉంటారు. ఏదైనా పెద్ద టోర్నీలో అథ్లెట్ పతకం గెలిచినప్పుడు, పోడియంపై నిలబడి పతకాన్ని ఎందుకు కొరుకుతారు?
ఇలా అథ్లెట్ మెడల్ ను కొరకడం నియమమా లేక సంప్రదాయమా? ఈ ప్రశ్న గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ! చరిత్ర ప్రకారం పురాతన కాలంలో విలువైన లోహాన్ని కరెన్సీగా ఉపయోగించారు. ఆ సమయంలో వ్యాపారులు బంగారు నాణేలను కత్తిరించి వాటి ప్రామాణికతను తనిఖీ చేసేవారు. ఎందుకంటే బంగారం మృదువైన లోహం, తక్కువ ఒత్తిడిని తట్టుకుంటుంది. దానిపై సులువుగా కాటు, గుర్తులను వేయవచ్చు.
స్వచ్ఛమైన బంగారు పతకాల ప్రదానం చేయడం ఒలింపిక్ క్రీడల్లో 1912 తర్వాత ఆగిపోయింది. కానీ పతకాన్ని పళ్లతో కొరికేయడం అంటే దాని స్వచ్ఛతను పరీక్షించడంలో ఒకటిగా చెప్పేవారు ఉన్నారు. ఇలా మాట్లాడటం సరికాదనే వారు ఉన్నారు. 1912 తర్వాత అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) స్వచ్ఛమైన బంగారు పతకాలు ఇవ్వడాన్ని నిలిపివేసింది. అయితే పతకాన్ని పళ్లతో కొరికేందుకే ఇలా చేసిందని కాదు.
1912కి ముందు కూడా అథ్లెట్లు పతకాలను పళ్లతో కొరికే వారని చరిత్ర చెబుతోంది. అప్పుడు బంగారం స్వచ్ఛత కోసం ఇలా చేసేవారు. కానీ ఈ సంప్రదాయం 1912 తర్వాత కూడా కొనసాగుతోంది. అయితే, ఇప్పుడు పతకం పళ్లను కొరకడం అలాంటి మెడల్ స్వచ్చతను గురించి కాదు. ఇలా చేయడం ద్వారా అథ్లెట్ తన పోటీలో తన కష్టాన్ని, పోటీని, ఉత్సాహాన్ని ప్రదర్శించడంగా పేర్కొంటున్నారు.
Olympics
అథ్లెట్లు తమ పతకాలను ఎందుకు కొరుకుతారనే దాని గురించి ఒలింపిక్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారంలో అథ్లెట్లు ఫోటో తీయడం కోసం పతకాలను పళ్లతో కొరుకుతారు. అథ్లెట్లు తమ పతకాలను పట్టుకుని పోడియంపై నిలబడితే, ఫోటోగ్రాఫర్లు తమ పతకాన్ని పళ్లతో కొరుకుతున్నట్లుగా పోజులు ఇవ్వమని అడుగుతారని పేర్కొంది. ఫోటోగ్రాఫర్లు ఈ విషయంలో భిన్నమైన నమ్మకాలను కలిగి ఉన్నారని చెప్పింది. వార్తా పత్రికలకు మొదటి పేజీలో ప్రచురించడానికి అద్భుతమైన పోజ్ గా దీనిని పేర్కొంటున్నారని ఒలింపిక్ వెబ్ సైట్ తెలిపింది.