ఒరేయ్ ఆజామూ.! ఇదే లాస్ట్ మ్యాచ్.. ఇక దబాంగ్ దబాంగ్ అంటున్న పాక్ మాజీలు..

Published : Feb 17, 2026, 06:15 PM IST

Pakistan Cricket: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్ జట్టుపై ఆ జట్టు మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్‌ల ప్రదర్శనను ప్రశ్నిస్తూ, వారిని జట్టు నుండి తప్పించాలని.. 

PREV
15
సొంత టీమ్‌పైనే ఘాటు వ్యాఖ్యలు

ప్రపంచకప్‌లో టీమిండియా చేతిలో 61 పరుగుల తేడాతో ఓటమిపాలైన పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై ఆ జట్టు మాజీ ఆటగాళ్లు, సీనియర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత టీమ్‌పైనే ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, జట్టు ఆటతీరును, ఆటగాళ్ల నిబద్ధతను ప్రశ్నిస్తున్నారు.

25
వరుసగా విఫలమవుతున్నారని..

మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ, తనకు అధికారం ఉంటే బాబర్ ఆజం, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిదిలను జట్టులోకి తీసుకునే వాడినే కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. వారికి ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చినా వరుసగా విఫలమవుతున్నారని ఆఫ్రిది పేర్కొన్నారు.

35
T20 జట్టును కొత్త ఆటగాళ్లతో..

మరో మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్, పెద్ద మ్యాచ్‌లలో సత్తా చూపడంలో వైఫల్యం, ఆరుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం సరైన నిర్ణయం కాదని మండిపడ్డారు. షాహీన్, బాబర్, షాదాబ్‌లను టీమ్ నుంచి తప్పించి, T20 జట్టును కొత్త ఆటగాళ్లతో నింపాలని మొహమ్మద్ యూసుఫ్ సూచించారు.

45
బహుశా ఇదే చివరి మ్యాచ్

పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్, బాబర్ ఆజం సూపర్ ప్లేయర్ అన్నది భ్రమ అని, అతడు ఒక్క మ్యాచ్ కూడా గెలిపించలేదని అన్నారు. బాబర్ ఆజంకు బహుశా ఇదే చివరి మ్యాచ్ అవుతుందని అహ్మద్ షెహజాద్ అభిప్రాయపడ్డారు.

55
జట్టు ప్రక్షాళన

పాక్ జట్టు మాజీలు, సీనియర్లు తమ సొంత జట్టు ప్రదర్శనపై నిరాశ, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు సూపర్ 8లోపే జట్టును ప్రక్షాళన చేయనున్నట్టు పాక్ జట్టు మేనేజ్ మెంట్ కనిపిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories