Team India: టీ20 ప్రపంచకప్ 2026లో మూడు వరుస విజయాలతో భారత్ సూపర్ 8కు అర్హత సాధించింది. పాకిస్తాన్‌పై 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి గ్రూప్ ఏ నుంచి తొలి జట్టుగా నిలిచింది. టీమిండియా సూపర్ 8 షెడ్యూల్‌లో..
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా అజేయంగా దూసుకుపోతోంది. గ్రూప్ దశలో మూడు వరుస విజయాలతో అద్భుతంగా ఆకట్టుకున్న భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్ 8కు అర్హత సాధించిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో టీమిండియా తన సూపర్ 8 షెడ్యూల్‌ను ఖరారు చేసుకుంది.
25
పాక్ పై విజయం
గత ఆదివారం, సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ పాకిస్తాన్‌పై 61 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్ ఏ నుంచి సూపర్ 8కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. భారత జట్టును పటిష్టమైన 175 పరుగుల స్కోర్ చేయగా.. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ వరుసగా వికెట్లు కోల్పోయి 114 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు ఏకపక్ష విజయం లభించింది.
35
సూపర్ 8కి ఫస్ట్ జట్టు
పాకిస్తాన్‌పై గెలుపుతో భారత్ తన విజయాల పరంపరను కొనసాగించడమే కాకుండా, గ్రూప్ ఏ నుంచి సూపర్ 8కి అర్హత సాధించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. మరోవైపు, పాకిస్తాన్ నెట్ రన్ రేట్ భారీగా తగ్గిపోవడంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. సల్మాన్ ఆగా సారథ్యంలోని పాకిస్తాన్ జట్టు తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో నమీబియాపై తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. లేదంటే గ్రూప్ దశలోనే అవమానకరంగా నిష్క్రమించాల్సి వస్తుంది.
గ్రూప్ దశలో టీమిండియా చివరి మ్యాచ్ ఈ నెల 18న నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఇప్పటికే సూపర్ 8కు అర్హత సాధించిన టీమిండియా తన షెడ్యూల్‌ను సిద్ధం చేసుకుంది. టీమిండియా సూపర్ 8 షెడ్యూల్‌లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లతో పాటు జింబాబ్వేతో తలబడనుంది.
55
భారత్ తలబడేది వీరితోనే
ఈ నెల 22న అహ్మదాబాద్‌లో సౌత్ ఆఫ్రికాతో భారత్ తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 26న చెన్నైలో జింబాబ్వేతో మ్యాచ్ ఆడనుంది. చివరిగా, మార్చి 1న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో టీమిండియా తలపడనుంది.