Arshad Nadeem : గోల్డెన్ బాయ్ అర్షద్ నదీమ్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం..

First Published | Aug 10, 2024, 11:08 PM IST

Arshad Nadeem : అర్షద్ నదీమ్ పారిస్ ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో లో సరికొత్త రికార్డు సృష్టిస్తూ గోల్డ్ మెడ‌ల్ గెలుచుకున్నాడు. భార‌త స్టార్ అథ్లెట్ నీర‌జ్ చోప్రా రెండో స్థానంతో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలుచుకున్నాడు. 
 

Arshad Nadeem : ఒక్క‌సారి కాదు రెండు సార్లు పారిస్ ఒలింపిక్స్ 2024 జావెలిన్ త్రో లో ప్రంచ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. ఒలింపిక్ చ‌రిత్రలో స‌రికొత్త రికార్డు సృష్టిస్తూ గోల్డ్ మెడ‌ల్ గెలుచుకున్నాడు. అత‌నే పాకిస్థాన్ స్టార్ అథ్లెట్ అర్ష‌ద్ న‌దీమ్. 

పారిస్ ఒలింపిక్స్ లో అర్ష‌ద్ న‌దీమ్ జావెలిన్ త్రో లో భార‌త్ స్టార్ అథ్లెట్ నీర‌జ్ చోప్రాకు షాకిస్తూ గోల్డ్ మెడ‌ల్ గెలుచుకున్నాడు. దీంతో పాకిస్తాన్‌ను స్పోర్టింగ్ హాల్ ఆఫ్ ఫేమ్‌కు చేర్చాడు. అర్ష‌ద్ నదీమ్ విసిరిన 92.97 మీటర్ల జావెలిన్ త్రో 32 ఏళ్ల త‌ర్వాత పాకిస్థాన్‌కి తొలి ఒలింపిక్ పతకాన్ని అందించాడు. త‌న చివ‌రి ప్ర‌య‌త్నంలో 91.79 మీటర్ల విసిరి రెండు సార్లు ఒలింపిక్ రికార్డులు సృష్టించాడు. 

Latest Videos


ఈ చారిత్రాత్మక విజయం తర్వాత అర్ష‌ద్ న‌దీమ్ ను పాకిస్తాన్ న‌గ‌దు బ‌హుమ‌తులు, స‌న్మానాలతో ముంచెత్తింది. ఆ దేశ అత్యున్నత పౌర పుర‌స్కారం అందించ‌నుంద‌ని స‌మాచారం. నదీమ్ కు పాకిస్తాన్ ప్రభుత్వం 150 మిలియన్ల న‌గ‌దును అందించ‌నుంది. ఇది భార‌త క‌రెన్సీలో ₹ 4.5 కోట్లు. దీంతో పాటు పాకిస్థాన్ పంజాబ్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్ 100 మిలియన్ల రివార్డును ప్రకటించారు. 

అలాగే, పంజాబ్ గవర్నర్ సర్దార్ సలీమ్ హైదర్ ఖాన్ మరో  2 మిలియన్ల బ‌హుమ‌తిని ప్రకటించారు. సింధ్ సీఎం కూడా నదీమ్‌కు PKR 50 మిలియన్లు ప్రకటించారు. సింధ్ గవర్నర్ కమ్రాన్ టెస్సోరీ మరో PKR 1 మిలియన్ ప్రకటించారు.

ఇక పాకిస్థాన్ గాయకుడు అలీ జాఫర్ కూడా నదీమ్‌కు 1 మిలియన్ పీకేఆర్ ఇస్తానని చెప్పగా, క్రికెటర్ అహ్మద్ షాజాద్ కూడా తన ఫౌండేషన్ ద్వారా ఒలింపియన్‌కు అదే మొత్తాన్ని అందజేస్తానని చెప్పాడు. రేడియో పాకిస్తాన్ నివేదిక ప్రకారం, పాకిస్తాన్ దిగువ సభ ఏకగ్రీవంగా నదీమ్‌ను అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.

సుక్కూర్‌లోని కొత్త స్పోర్ట్స్ స్టేడియానికి అర్ష‌ద్ నదీమ్ పేరు పెట్టనున్నట్లు షేక్ తెలిపారు. కరాచీలో 'అర్షద్ నదీమ్ అథ్లెటిక్స్ అకాడమీ'ని ఏర్పాటు చేయనున్నట్లు కరాచీ మేయర్ ముర్తాజా వహాబ్ కూడా ప్రకటించారు. 

click me!