ఒలింపిక్ వేదిక‌పై గోల్డ్ మెడ‌ల్ ప్రపోజ్.. పారిస్ ఒలింపిక్స్ ల‌వ్ స్టోరీ ఇది.. !

Published : Aug 03, 2024, 08:07 PM IST

Marriage Proposal at Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత చైనీస్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ హువాంగ్ యా కియోంగ్‌కు సహచర ఆటగాడు లి యుచెన్ ప్ర‌పోజ్ చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైర‌ల్ గా మారాయి.   

PREV
16
ఒలింపిక్ వేదిక‌పై గోల్డ్ మెడ‌ల్ ప్రపోజ్.. పారిస్ ఒలింపిక్స్ ల‌వ్ స్టోరీ ఇది.. !
Marriage Proposal at Paris Olympics,

ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్ వేదిక‌పై ఇద్ద‌రు ప్లేయ‌ర్లు ఒక్క‌ట‌య్యారు. మెడ‌ల్ గెలిచిన త‌ర్వాత ఈ ముచ్చటగొలిపే దృశ్యం కనిపించింది. చైనాకు చెందిన స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ హువాంగ్ యా కియోంగ్ గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత పెళ్లి ప్ర‌పోజల్ వచ్చింది. ఆమె స్వర్ణం గెలిచిన త‌ర్వాత తోటి క్రీడాకారుడు లీ యుచెన్ ఆమెకు బహిరంగంగా పెళ్లి ప్రపోజ్ చేశారు. దానికి సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్‌గా మారాయి.

26
Marriage Proposal at Paris Olympics, Olympics proposal, Huang Ya Qiong, Liu Yuchen

మెడ‌ల్ గెలిచి దానిని అందుకున్న త‌ర్వాత హువాంగ్ యా కియోంగ్ త‌న తోటి ప్లేయ‌ర్ చేసిన పెళ్లి ప్ర‌పోజ్ ను ఆనందంతో అంగీకరించారు. వీరిద్ద‌రితో పాటు అక్క‌డున్న ప్రేక్ష‌కులు అంద‌రూ ఆనందంలో మునిగిపోయారు. శుక్రవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో హువాంగ్ జెంగ్ సివీతో కలిసి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. 21-8 21-11తో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ వాన్ హో, జియోంగ్ నా యున్‌లను ఓడించారు.

36
Marriage Proposal at Paris Olympics, Olympics proposal, Huang Ya Qiong, Liu Yuchen

హువాంగ్ పతకం గెలిచిన తర్వాత ప్రియుడు యుచెన్ ఆమె కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. హువాంగ్‌కు పుష్పగుచ్ఛాన్ని అందించిన త‌ర్వాత తన జేబులో నుండి ఉంగరాన్ని తీసి మోకాళ్లపై ఉండి ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేశారు. దీనికి ఒకే చెప్పిన త‌ర్వాత ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఈ ఆనంద క్ష‌ణాలు ఇప్పుడు వైర‌ల్ గా మారియి. 

46
Marriage Proposal at Paris Olympics, Olympics proposal, Huang Ya Qiong, Liu Yuchen

ఈ ప్ర‌పోజ‌ల్ క్ర‌మంలో ఆశ్చర్యానికి గురైన హువాంగ్.. పారిస్ లో ఇలాంటి జ‌రుగుతుంద‌ని అనుకోలేద‌ని అన్నారు. ఒలింపిక్ గేమ్స్‌కు ముందు పూర్తిగా తాను పోటీల‌ సన్నద్ధతపై దృష్టి సారించానని చెప్పింది. అలాగే, ప్ర‌స్తుతం చాలా సంతోషంగా ఉన్నాన‌నీ, త‌న‌కు ఇప్పుడు క‌లుగుతున్న అనుభూతిని వ‌ర్ణించ‌లేక‌పోతున్నాన‌ని కూడా చెప్పారు. 

 

56
Marriage Proposal at Paris Olympics, Olympics proposal, Huang Ya Qiong, Liu Yuchen

త‌న‌కు  వ‌చ్చిన ప్ర‌పోజ‌ల్ కు హువాంగ్ ఎస్ అంటూ తల వూపి కన్నీళ్లు పెట్టుకుంది. "బంగారు పతకం సాధించడం మా ప్రయాణానికి గుర్తింపు. ఎంగేజ్‌మెంట్ రింగ్ నన్ను ఆశ్చర్యపరిచింది. నేను ఒలింపిక్ ఛాంపియన్‌గా మారడానికి శిక్షణపై దృష్టి పెట్టాను. నేను దీనిని ఊహించలేదు" అని  చెప్పింది.

66
Marriage Proposal at Paris Olympics, Olympics proposal, Huang Ya Qiong, Liu Yuchen

సమ్మర్ గేమ్స్‌లో పెళ్లి ప్రపోజల్ తో ఒక్కటైన ఏకైక అథ్లెట్లు వీరేనని పేర్కొంటూ అధికారిక ఒలింపిక్స్ వెబ్‌సైట్ ఈ జంట చిత్రాన్ని షేర్ చేసింది. అర్జెంటీనా పురుషుల హ్యాండ్‌బాల్ ఆటగాడు పాబ్లో సిమోనెట్ తన స్నేహితురాలు, అర్జెంటీనా మహిళల హాకీ జట్టు సభ్యురాలు మరియా కాంపోయ్‌కి గేమ్స్ ప్రారంభమయ్యే ముందు ఒలింపిక్ విలేజ్‌లో ప్రపోజ్ చేసినట్లు కూడా సైట్ పేర్కొంది. 

Read more Photos on
click me!

Recommended Stories