విడాకుల ప్ర‌తీకారంతోనే షూటింగ్ మొద‌లుపెట్టాడా? ఒలింపిక్ ఫేమ్ టర్కీ షూటర్ యూసఫ్ డికేక్ అసలు కథ.. !

First Published | Aug 3, 2024, 6:18 PM IST

Olympic fame Turkey Yusuf Dikec : మిక్స్ డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో టర్కీ ఒలింపిక్ షూటర్ యూసుఫ్ డికేక్ రజత పతకం సాధించాడు. అయితే, షూటింగ్ స‌మ‌యంలో అతని రిలాక్స్డ్ షూటింగ్ శైలి, సాధార‌ణ క‌ళ్ల‌ద్దాలు ధ‌రించి, స్టైల్ గా ఒక చేతిని జేబులో పెట్టుకుని షూట్ చేయ‌డంతో ఇంట‌ర్నెట్ ను షేక్ చేస్తున్నాడు. 
 

Yusuf Dikec, Turkey,

Olympic fame Turkey Yusuf Dikec : ఒలింపిక్ ఫేమ్ టర్కీ యూసఫ్ డికేక్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్. పారిస్ ఒలింపిక్స్ లో అత‌ని ప్ర‌ద‌ర్శ‌న ఇప్పుడు ఇంట‌ర్నెట్ ను షేక్ చేస్తోంది. ఎందుకంటే 50 సంవ‌త్స‌రాలున్న ఈ ట‌ర్కీ షూట‌ర్.. ఈవెంట్ టైమ్ లో రిలాక్స్డ్ షూటింగ్ శైలి, సాధార‌ణ క‌ళ్ల‌ద్దాలు ధ‌రించి, స్టైల్ గా ఒక చేతిని జేబులో పెట్టుకుని షూట్ చేయ‌డంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. త‌న అద్భుత‌మైన స్టైలిష్ లుక్ తో షూటింగ్ మొద‌లు పెట్టి మెడ‌ల్ ఎగ‌రేసుకుపోయాడు.

మిక్స్‌డ్ టీమ్ 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో డికేక్, అతని భాగస్వామి సెవ్వల్ ఇలయిడా తర్హాన్‌తో కలిసి టర్కీకి రజత పతకాన్ని అందించాడు. ఫైనల్స్‌లో సెర్బియా చేతిలో తృటిలో గోల్డ్ మెడ‌ల్ ను చేజారింది. షూటింగ్ లో పాల్గొనే అథ్లెట్లు సాధారణంగా హెడ్‌ఫోన్‌లు, ప్రత్యేక లెన్స్‌లు లేదా టోపీలు వంటి ప్రత్యేక పరికరాలను ధ‌రిస్తారు. అయితే, డికేక్ ఇవేమీ లేకుండా  చాలా కూల్ గా క‌నిపిస్తూ.. సాధార‌ణ దుస్తులు, సాధార‌ణ ఐ గ్లాసెస్ ధ‌రించి షూటింగ్ చేసిన మినిమలిస్ట్ విధానం ప్రత్యేకంగా నిలిచాయి.


Yusuf Dikec

ఈ టర్కీ షూట‌ర్ స్టాండర్డ్ గ్లాసెస్,  టీ-షర్టును ధరించాడు. అలాగే, షూట్ చేస్తూ అత‌ని ఎడమ చేతిని జేబులో పెట్టుకుని సినిమాలో హీరోలు చేసే విధంగా చాలా సింపుల్ గా, కూల్ షూటింగ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. స్టైలిష్ గా షూటింగ్ చేసి మెడ‌ల్ గెలిచిన ఈ ట‌ర్కీ షూట‌ర్ తన ప్రత్యేకమైన షూటింగ్ టెక్నిక్ గురించి మాట్లాడుతూ.. "ప్రపంచంలోని అరుదైన షూటింగ్ టెక్నిక్‌లలో నా షూటింగ్ టెక్నిక్ ఒకటి. నేను రెండు కళ్లూ తెరిచి షూట్ చేస్తాను. దీనికి రిఫరీలు కూడా ఆశ్చర్యపోతున్నారు" అని చెప్పాడు. 

అలాగే, విజ‌యం మీ జేబులో ఉండ‌ద‌నీ, తమ కఠోరమైన సన్నద్ధత వల్లే పతకం గెలుస్తానని అనుకున్నానని చెప్పాడు. పారిస్ ఒలింపిక్స్ కోసం చాలా క‌ఠినంగా సిద్ధ‌మ‌య్యాము. ఈ విజయం టర్కీ ప్ర‌జ‌లంద‌రికీ చెందుతుందని తెలిపాడు ఈ ఒలింపిక్ ఫేమ్. ఈ క్ర‌మంలోనే యూసఫ్ డికేక్ షూటింగ్ శైలి, అతని విజయం వెనుక రహస్యాలు గురించి అనేక చర్చలు జ‌రుగుతున్నాయి. కొంతమంది సోషల్ మీడియాలో డికేక్ యూసుఫ్ ఒక మెకానిక్ అనీ, కొన్ని గందరగోళ ప‌రిస్థితుల్లో విడాకుల తర్వాత షూటింగ్ మొద‌టు పెట్టార‌ని పేర్కొన్నారు. 

మ‌రొక నెటిజ‌న్ స్పందిస్తూ.. "ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన తర్వాత, యూసుఫ్ పోడియంపై నిలబడి, అతని మాజీ భార్య షారోన్‌కి సందేశం ఇచ్చాడని పేర్కొన్నాడు. అయితే, ఇందులో వాస్త‌వం లేద‌ని ప‌లువురు పేర్కొన్నారు. డికేక్ టర్కిష్ జెండర్‌మెరీ రిటైర్డ్ సీనియర్ మాస్టర్ సార్జెంట్ అనీ, సైనిక పాఠశాలలో చదువుతున్నాడని తెలిపారు. అలాగే,  2007లో హైదరాబాద్‌లో జరిగిన మిలిటరీ వరల్డ్ గేమ్స్‌లో పాల్గొనడానికి భారతదేశాన్ని కూడా సందర్శించాడ‌ని స‌మాచారం.

Latest Videos

click me!