ODI Records : ముగ్గురు మొనగాళ్లు.. వన్డే క్రికెట్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కింగ్‌లు ఎవరో తెలుసా?

Published : Dec 05, 2025, 09:26 PM IST

Player of the Match Records : వన్డే ఇంటర్నేషనల్స్ చరిత్రలో ఇప్పటికే అనేక అసాధారణ క్రికెట్ రికార్డులు చాలానే నమోదయ్యాయి. అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు గెలిచిన టాప్ 3 క్రికెటర్లు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
14
వన్డే క్రికెట్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' కింగ్‌లు వీరే!

అంతర్జాతీయ క్రికెట్‌లో, ముఖ్యంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఎందరో గొప్ప ఆటగాళ్లు తమదైన ముద్ర వేశారు. వన్డే క్రికెట్‌లో తమ అద్భుతమైన ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రపంచ క్రికెట్‌లో విశేష గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజాలు ఉన్నారు. అలాంటి వారిలో, ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగలిగే సామర్థ్యం ఉన్న కొంతమంది ఆటగాళ్లు ఉన్నారు. ఈ అత్యుత్తమ ప్రదర్శనలకు గాను వారు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులతో రికార్డుల మోత మోగించారు.

వన్డే ఇంటర్నేషనల్ (ODI) క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులను గెలుచుకున్న టాప్ 3 క్రికెటర్లలో భారత ప్లేయర్లు కూడా ఉన్నారు. ఈ టాప్ ఆటగాళ్లు కేవలం వ్యక్తిగత అవార్డులను గెలవడమే కాకుండా, క్లిష్ట పరిస్థితుల్లో తమ జట్లకు విజయాన్ని అందించడంలో ముఖ్యపాత్ర వహించారు. ODIలలో అత్యధిక అవార్డులను గెలుచుకున్న టాప్ 3 ప్లేయర్ల లిస్టు గమనిస్తే..

24
3. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ

భారత స్టార్ బ్యాట్స్‌మెన్, 'రన్ మెషిన్'గా పేరుగాంచిన విరాట్ కోహ్లీ కూడా ఈ అగ్రశ్రేణి జాబితాలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. కోహ్లీ ఇప్పటివరకు ఆడిన 306 వన్డే మ్యాచ్‌లలో 44 సార్లు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకున్నారు. ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో ఈ ఘనత సాధించిన వారిలో ఆయన అగ్రస్థానంలో ఉన్నారు.

విరాట్ ఫామ్ చూస్తుంటే, త్వరలోనే సనత్ జయసూర్య రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. కోహ్లీ ప్రస్తుత ప్రదర్శన స్థాయిని పరిగణనలోకి తీసుకుంటే, రాబోయే రోజుల్లో ఆయన మరెన్నో రికార్డులను తన పేరు మీద లిఖించుకోవడం ఖాయం.

34
2. శ్రీలంక విధ్వంసక వీరుడు సనత్ జయసూర్య

శ్రీలంక క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప వన్డే ఆటగాళ్ల గురించి ప్రస్తావించినప్పుడు, సనత్ జయసూర్య పేరు ముందు వరుసలో ఉంటుంది. ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు గెలుచుకున్న క్రీడాకారులలో జయసూర్య రెండో స్థానంలో ఉన్నారు.

జయసూర్య తన క్రికెట్ కెరీర్‌లో ఆయన మొత్తం 445 వన్డే మ్యాచ్‌లు ఆడారు. ఈ మ్యాచ్‌లలో ఆయన 48 సార్లు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును తన ఖాతాలో వేసుకున్నారు. తన విధ్వంసక బ్యాటింగ్, అవసరమైన సమయంలో జట్టును ఆదుకునే బౌలింగ్‌తో శ్రీలంకకు ఎన్నో విజయాలను అందించారు.

44
1. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్

ఈ జాబితాలో నంబర్ 1 స్థానంలో 'గాడ్ ఆఫ్ క్రికెట్'గా గుర్తింపు పొందిన భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నారు. ఆయన 24 సంవత్సరాల సుదీర్ఘ వన్డే కెరీర్‌లో 463 మ్యాచ్‌లు ఆడారు. ఈ కాలంలో సచిన్ 18,000 కంటే ఎక్కువ పరుగులు సాధించారు. 

సచిన్ వన్డే ఇంటర్నేషనల్స్‌లో అత్యధికంగా 62 సార్లు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకుని తనదైన ముద్ర వేశారు. ఈ జాబితాలో ఆయన రికార్డుకు దగ్గరగా ఏ ఆటగాడూ లేరు. ఇది ఆయన సుదీర్ఘ కెరీర్లో నిలకడగా అందించిన అత్యుత్తమ ప్రదర్శనలకు నిదర్శనం.

ఈ ముగ్గురు దిగ్గజాలు వన్డే ఫార్మాట్‌లో తమ ఆధిపత్యాన్ని చాటి, తమ జట్ల విజయాల్లో తిరుగులేని పాత్ర పోషించారు.

Read more Photos on
click me!

Recommended Stories