చ‌రిత్ర సృష్టించిన నీర‌జ్ చోప్రా.. భార‌త్ కు పారిస్ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడ‌ల్

First Published | Aug 9, 2024, 1:20 AM IST

Neeraj Chopra : నీరజ్ చోప్రా 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. 2022లో ఈ టోర్నీలో రజత పతకాన్ని అందుకున్నాడు. 2022 డైమండ్ లీగ్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు. 2018, 2022 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2018లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఛాంపియన్‌గా నిలవడంతో పాటు టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడ‌ల్ సాధించాడు. ఇప్పుడు పారిస్ లో ఒలింపిక్ సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు.  
 

Neeraj Chopra :  పారిస్ ఒలింపిక్స్ 2024 లో భార‌త్ మ‌రో మెడ‌ల్ గెలుచుకుంది. టీమిండియా స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్స్ నీర‌జ్ చోప్రాకు త‌న రెండో ఒలింపిక్ మెడ‌ల్ సాధించాడు. పారిస్ గ‌డ్డ‌పై తిరుగులేని ప్ర‌ద‌ర్శ‌న‌తో భార‌త జెండాను రెప‌రెప‌లాడించాడు. జావెలిన్ త్రో లో సిల్వర్ మెడల్ గెలిచాడు. 89.45 మీటర్లు విసిరి సిల్వర్ మెడల్ గెలిచాడు. వరుసగా రెండు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన భారత అథ్లెట్ గా రికార్డు సాధించాడు. పాకిస్థాన్ కు చెందిన అర్షద్ నదీమ్ ఒలింపిక్ రికార్డును బ్రేక్ చేస్తూ ఏకంగా 92.97 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ అందుకున్నాడు. మూడో స్థానంలో ఉన్న  గ్రెనడాకు చెందిన ఏ.పీటర్ 88.54 మీటర్లతో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నాడు. 

Paris Olympics 2024, Neeraj Chopra

నీరజ్ చోప్రా ఎవరు?
ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో  భార‌త్ కు మొట్ట‌మొద‌టి గోల్డ్ మెడ‌ల్ సాధించిన పెట్టిన స్టార్ నీర‌జ్ చోప్రా. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ 2024లో భార‌త్ కు మెండ‌ల్ అందించ‌డానికి సిద్ధంగా ఉన్నాడు. ఆగస్ట్ 7, 2021న టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌లో భారతదేశానికి మొట్టమొదటి బంగారు పతకాన్ని అందించి చరిత్ర సృష్టించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. హర్యానాలోని పానిపట్ సమీపంలోని ఖండ్రా గ్రామం రైతు కుటుంబంలో డిసెంబర్ 24, 1997న జన్మించాడు. చండీగఢ్‌లోని దయానంద్ ఆంగ్లో-వేద కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు.
 
నీర‌జ్ చోప్రా తల్లి సరోజ్ దేవి గృహిణి, తండ్రి సతీష్ కుమార్ రైతు. క్రీడ‌ల్లోకి రాక‌ముందు నీర‌జ్ చోప్రా లావుగా, అధిక బరువుతో ఉండ‌టం చూసిన అత‌ని కుంటుంబం క్రీడలలో పాల్గొనమని అత‌న్ని ఒప్పించారు. ఈ క్ర‌మంలోనే క్రీడ‌ల్లోకి అడుగుపెట్టిన అత‌ను జావెలిన్ త్రో అథ్లెటిక్ గా మారాడు. పానిపట్‌లోని శివాజీ స్టేడియంలో త‌న‌ శిక్షణను మొద‌లుపెట్టాడు. ఒక సంవత్సరం శిక్షణ తర్వాత 23 నీర‌జ్ చోప్రా.. పంచకులలోని తౌ దేవి లాల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో చేరాడు, అక్కడ అతని కోచ్ నసీమ్ అహ్మద్ జావెలిన్ త్రోతో పాటు లాంగ్ రన్నింగ్‌లో శిక్షణ పొందాడు.
 


నీరజ్ చోప్రా సాధించిన విజయాలు

2012 చివ‌ర‌లో నీరజ్ చోప్రా అండ‌ర్-16 జాతీయ ఛాంపియన్ గా అవ‌త‌రించాడు. 2014లో బ్యాంకాక్‌లో జరిగిన యూత్ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్‌లో తొలిసారి అంతర్జాతీయ పతకాన్ని (రజతం) గెలుచుకున్నాడు. 2015లో అతను చెన్నైలో జరిగిన ఇంటర్-స్టేట్ ఈవెంట్‌లో 77.33 మీటర్ల త్రోతో జాతీయ సీనియర్ ఛాంపియన్‌షిప్‌లో తన మొదటి పతకాన్ని సాధించాడు. ఇది జ‌రిగినకొన్ని నెలలకు కోల్‌కతాలో నేషనల్ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాడు. గౌహతిలో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో నీరజ్ చోప్రా 82.23 మీటర్ల త్రోతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడంతో 2016వ సంవత్సరం అతని కెరీర్ లో గొప్ప ఏడాదిగా నిలిచింది. 

నీర‌జ్ చోప్రా ఉవే హోన్, గ్యారీ కాల్వెర్ట్, వెర్నర్ డేనియల్స్ మార్గదర్శకత్వంలో తన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకున్నాడు. అనేక జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో అతని ప్రదర్శనతో ఆకట్టుకున్న నీర‌జ్ చోప్రాను భారత సైన్యం 2017లో జూనియర్ కమిషన్ ఆఫీసర్‌గా స‌త్క‌రించింది. అతనికి 'నాయబ్ సుబేదార్' ర్యాంక్‌తో రాజ్‌పుతానా రైఫిల్స్‌లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా నియామించింది. ఆర్మీలో చేరిన తర్వాత, చోప్రా 'మిషన్ ఒలింపిక్స్ వింగ్'తో పాటు పూణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణకు ఎంపిక‌య్యాడు. మిషన్ ఒలింపిక్స్ వింగ్ అనేది వివిధ జాతీయ, అంతర్జాతీయ పోటీల కోసం 11 విభాగాల్లో ఆశాజనకమైన క్రీడాకారులను గుర్తించి వారికి శిక్షణనిచ్చేందుకు భారత సైన్యం చోర‌వ‌తో చేప‌ట్టిన కార్య‌క్ర‌మం. 

2018లో అతను కామన్వెల్త్ గేమ్స్‌లో 86.47 మీటర్ల సీజన్-ఉత్తమ ప్రయత్నంతో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు నీర‌జ్ చోప్రా. అదే సంవత్సరం దోహాలో జరిగిన డైమండ్ లీగ్‌లో తన వ్యక్తిగత అత్యుత్తమ 87.43 మీటర్లను త్రోను అందుకున్నాడు. ఆగస్టు 27న ఆసియా క్రీడల్లో నీరజ్ 88.06 మీటర్లు విసిరి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. మోచేయి గాయం కారణంగా అత‌ను 2019లో ఎనిమిది నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు.ఆ త‌ర్వాత అద్భుతంగా పున‌రాగ‌మ‌నం చేస్తూ.. ఆగస్ట్ 7, 2021న నీరజ్ చోప్రా భార‌త్ కు మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ ఒలింపిక్ బంగారు పతకాన్ని అందించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించడానికి అతను తన రెండవ ప్రయత్నంలో 87.58 మీటర్లు విసిరాడు. అభినవ్ బింద్రా తర్వాత వ్యక్తిగత ఈవెంట్లలో బంగారు పతకం సాధించిన రెండో భారతీయుడిగా ఘ‌న‌త సాధించాడు. నీరజ్ చోప్రా గెలుచుకున్న అవార్డుల్లో అర్జున అవార్డు (2018),  విశిస్ట్ సేవా పతకం (VSM-2020) ఉన్నాయి.

Latest Videos

click me!