52 ఏళ్ల తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఒలింపిక్ మెడ‌ల్స్ గెలిచిన భారత హాకీ జట్టు

First Published | Aug 8, 2024, 7:51 PM IST

Indian Hockey:  పారిస్ ఒలింపిక్స్ 2024 లో భార‌త హాకీ జ‌ట్టు స్పెయిన్ ను ఓడించి బ్రాంజ్ మెడ‌ల్ గెలుచుకుంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన  ఈ మ్యాచ్ లో కెప్టెన్ హర్మన్ ప్రీత్, శ్రీజేష్ లు కీలక పాత్ర పోషించారు. 
 

52 ఏళ్ల తర్వాత బ్యాక్ టు బ్యాక్  ఒలింపిక్ ప‌త‌కాలు సాధించింది భార‌త హాకీ జ‌ట్టు. పారిస్ ఒలింపిక్స్ 2024 లో బ్రాంజ్ మెడ‌ల్ కోసం జ‌రిగిన ఉత్కంఠ పోరులో స్సెయిన్ ను ఓడించి మెడ‌ల్ సాధించింది భార‌త్. 

భారత పురుషుల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త్ కు 4వ‌ కాంస్య ప‌త‌కం ల‌భించింది. ఈ విజయంలో టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ కీలకపాత్ర పోషించాడు.


హ‌ర్మ‌న్ ప్రీత్ సింగ్ వరుసగా పెనాల్టీ కార్నర్‌లలో రెండు గోల్స్ చేశాడు. దీంతో స్పెయిన్ ను భార‌త్ 2-1 తేడాతో ఓడించింది.  ఈ గెలుపుతో ఒలింపిక్స్‌లో భారత్‌ వరుసగా రెండోసారి కాంస్యం సాధించింది. గతసారి టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీని ఓడించి బ్రాంజ్ మెడ‌ల్ గెలుచుకుంది.

1928లో ఆమ్‌స్టర్‌డామ్ క్రీడల్లో భారత హాకీ జట్టు తొలి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకుంది. ఐదు మ్యాచ్‌లలో 29 గోల్స్ చేసి బంగారు పతకాన్ని గెలుచుకుంది. భార‌త హాకీ మాత్రికుడు మాంత్రికుడు ధ్యాన్ చంద్ నెదర్లాండ్స్‌తో జరిగిన ఫైనల్‌లో హ్యాట్రిక్ సహా 14 గోల్స్ చేశాడు.

India vs Germany Hockey

ఈ గెలుపుతో పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు నాలుగో పతకం లభించింది. నాలుగింటిలో ఒక‌టి హాకీ నుంచి, మ‌రో మూడు మెడ‌ల్స్ షూటింగ్‌లో వ‌చ్చాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్ మూడో స్థానంలో నిలిచింది. అలాగే, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి మ‌ను భాక‌ర్ కాంస్యం గెలుచుకుంది.  దీని త‌ర్వాత పురుషుల 50 మీటర్ల రైఫిల్ లో స్వప్నిల్ కుసాలే మూడవ స్థానంలో నిలిచి భార‌త్ కు మ‌రో కాంస్యం అందించాడు. 

Latest Videos

click me!