Tilak Varma : ఐపీఎల్ 2026లో తిలక్ వర్మ మెరుపు సెంచరీతో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు సాధించింది. 45 బంతుల్లోనే 101 పరుగులు చేసి గుజరాత్ బౌలర్లను తిలక్ చిత్తు చేశాడు.
45 బంతులు.. 101 పరుగులు.. తిలక్ వర్మ బ్యాటింగ్ చూస్తే పూనకాలే!
ఐపీఎల్ 2026లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. కేవలం 45 బంతుల్లోనే అజేయంగా 101 పరుగులు చేసి, తన తొలి ఐపీఎల్ సెంచరీని నమోదు చేశాడు. మొదట నిదానంగా ఆడినా, చివర్లో ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఆఖరి ఓవర్‌లో ఫోర్‌తో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
మ్యాచ్ ప్రారంభంలో తిలక్ వర్మ చాలా నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఒకానొక సమయంలో అతను 22 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, క్రీజులో కుదురుకున్నాక ఒక్కసారిగా గేర్ మార్చిన తిలక్ వర్మ, గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తర్వాతి కేవలం 23 బంతుల్లోనే అతను ఏకంగా 82 పరుగులు పిండుకోవడం గమనార్హం.
25
నమన్ ధీర్‌తో కీలక భాగస్వామ్యం
ముంబై ఇండియన్స్ పవర్‌ప్లేలో 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో తిలక్ వర్మ క్రీజులోకి వచ్చాడు. ఆ సమయంలో నమన్ ధీర్‌తో (45 పరుగులు) కలిసి 50 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, తిలక్ మాత్రం తన ఏకాగ్రత కోల్పోకుండా భారీ షాట్లతో స్కోరు బోర్డును పరిగెత్తించాడు.
35
డెత్ ఓవర్లలో విధ్వంసం రేపిన తిలక్ వర్మ
ముఖ్యంగా డెత్ ఓవర్లలో తిలక్ వర్మ ఆడిన తీరు అద్భుతం. ఈ ఐదు ఓవర్లలోనే అతను 65 పరుగులు రాబట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 15వ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో కలిపి 19 పరుగులు పిండుకున్నాడు. అశోక్ శర్మ వేసిన 18వ ఓవర్‌లో వరుసగా 6, 4, 4, 6, 6 బాది మొత్తం 26 పరుగులు సాధించి మ్యాచ్‌ను పూర్తిగా ముంబై వైపు తిప్పేశాడు.
ఈ సెంచరీతో తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన ఆటగాళ్లలో సనత్ జయసూర్య రికార్డును సమం చేశాడు. ఇద్దరూ కేవలం 45 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించారు. అలాగే నంబర్ 5 లేదా అంతకంటే తక్కువ స్థానంలో వచ్చి ఐపీఎల్‌లో సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా తిలక్ వర్మ నిలిచాడు.
55
సెంచరీ వేళ ఎమోషనల్ సెలబ్రేషన్స్
ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ చివరి బంతికి ఫోర్ కొట్టి తన అజేయ సెంచరీని (101*) పూర్తి చేసుకున్నాడు. సెంచరీ పూర్తవగానే తన హెల్మెట్ తీసి పక్కన పెట్టి, ఆకాశం వైపు చూస్తూ రెండు చేతులూ జోడించి ఎమోషనల్ అయ్యాడు. డగౌట్‌లో ఉన్న హార్దిక్ పాండ్యా తన సీటు నుంచి లేచి గంతులు వేస్తూ తిలక్ వర్మ ఇన్నింగ్స్‌ను అభినందించాడు. తిలక్ ఇన్నింగ్స్ కారణంగా ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 199 పరుగులు చేయగలిగింది.