1. జీర్ణక్రియ మందగించడం (Digestion Issues)
అరటిపండులో ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉంటుంది. అరటిపండు తిన్న వెంటనే ఎక్కువ నీళ్లు తాగడం వల్ల జీర్ణరసాలు పలుచబడతాయి. దీనివల్ల జీర్ణ ప్రక్రియ నెమ్మదించి, గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
2. ఆయుర్వేదం ఏం చెబుతోంది.. (Ayurvedic Perspective)
ఆయుర్వేదం ప్రకారం... అరటిపండు శరీరానికి 'శీతల' (చలవ) గుణాన్ని ఇస్తుంది. దీనిపై మళ్లీ చల్లని నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో మార్పులు వచ్చి జలుబు లేదా దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కనీసం 20 నుండి 30 నిమిషాల విరామం తర్వాతే నీళ్లు తాగాలని పెద్దలు సూచిస్తారు.
3. శరీరానికి పోషకాల అందవు (Nutrient Absorption)
అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల ఈ పోషకాలు సరిగ్గా ఒంటికి పట్టకుండానే విసర్జితమయ్యే అవకాశం ఉంటుందని కొందరు నిపుణుల అభిప్రాయం.
4. కడుపులో అసౌకర్యం
అరటిపండులోని పీచు పదార్థం నీటిని పీల్చుకుని కడుపులో గడ్డకట్టినట్లుగా అనిపించవచ్చు. దీనివల్ల కొంతమందికి వికారం లేదా అజీర్తిగా అనిపిస్తుంది.